విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు తల పెట్టిన సమ్మె వాయిదా వేశారు.. వేతన ఒప్పందం అమలు కోసం ఈ నెల 31వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లనున్నట్టు మొదట నోటీసులు ఇచ్చింది అఖిలపక్షం.. అయితే, కార్మిక సంఘాలతో ఇవాళ కార్మిక శాఖ జాయింట్ కమిషనర్, ఆర్.ఐ.ఎన్. ఎల్.యాజమాన్యం చర్చలు జరిపింది.. ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.. అయితే, ఆ తర్వాత ఈ నెల 31వ తేదీ నుంచి తలపెట్టిన సమ్మెను వాయిదా వేస్తున్నట్టు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్రకటించారు. పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని సమ్మెను వాయిదా వేస్తున్నట్లు వివరించారు. ప్లాంట్ యాజమాన్యం వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని స్టీల్ ప్లాంట్ గుర్తింపు యూనియన్ అధ్యక్షుడు జె.అయోధ్యరామ్ డిమాండ్ చేశారు.
Read Also: కార్ల అమ్మకాల్లో కొత్త రికార్డు.. ఏడాదిలో కోటిపైగా విక్రయం..