అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు చేదుఅనుభవం ఎదురైంది.. తమ గ్రామానికి రోడ్డు లేక ఇబ్బందులకు గురిఅవుతున్నామంటూ ఆందోళనకు దిగిన స్థానికులు.. ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్నారు.. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వాహనాన్ని అడ్డుకున్నారు గ్రామస్తులు.. గత 25 సంవత్సరాలుగా రోడ్డు లేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేసిన ప్రజలు.. ఎమ్మెల్యే రాజీనామా […]
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి గ్రూపులు, అంతర్గత కలహాలు, కుమ్ములాట ఇలా ఏవీ కొత్త కాదు.. సందర్భాలను బట్టి అంతర్గత విభేదాలు బయట పడుతూనే ఉన్నాయి.. తాజాగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది.. కొత్త కమిటీలు వివాదానికి దారితీస్తున్నాయి… ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో మండల కమిటీల మార్పిడితో పాత క్యాడర్లో ఆందోళన మొదలైంది.. ఈ పరిణామంపై పాత క్యాడర్ ఆగ్రహంగా ఉంది. ఇదంతా మహేశ్వర్ రెడ్డి వర్గం పనే అంటున్న మండిపడుతోంది ప్రేమ్ సాగర్ […]
తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. మళ్లీ ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తూ.. దిద్దుబాటు చర్యలకు పూనుకుంటున్నారు.. ఇక, నల్గొండ ఆర్టీసీ డిపోల్లో ఆకస్మిక తనిఖీలు చేవారు సజ్జనార్.. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్గో సేవలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని.. రైతులకు కూడా ఉపయోగపడేలా కార్గో సేవలు అందించనున్నట్టు వెల్లడించారు.. రెండేళ్లుగా 30 శాతం డీజిల్ ధరలు పెరగడంతో […]
దీపావళి అంటే పూలు, పండ్లు, స్వీట్లు, టపాసులకే డిమాండ్ ఉందనుకుంటే పొరపాటే.. ఎందుకంటే.. తమిళనాడు ప్రభుత్వానికి దీపావళి కాసుల వర్షం కురిపించింది.. ఏకంగా రూ.443 కోట్ల మందును లాగించేశారు మందుబాబులు.. పండుగ సందర్భంగా రెండు రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా రూ.443 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగినట్టు అధికారులు చెబుతున్నారు.. అయితే, గత ఏడాదితో పోల్చుకుంటే మాత్రం ఈ సారి రూ.24.66 కోట్ల మేర తక్కువగా మద్యం విక్రయాలు జరిగాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక, దీపావళి వేళ […]
దీపావళి పండుగ వచ్చిందంటే చాలు యాదవులు తమ ఐక్యతను చాటుతూ సదర్ ఉత్సవాలను నిర్వహిస్తుంటారు.. ఒక్కప్పుడు హైదరాబాద్‌కు పరిమితమైన ఈ ఆనవాయితీ క్రమంగా కాలనీలు.. టౌన్లు, గ్రామాలకు కూడా విస్తరించింది.. అయితే.. ఎన్నో సంవత్సరాలుగా హైదరాబాద్‌లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు యాదవ సోదరులు.. ఇప్పటికే శుక్రవారం రాత్రి నగరంలోని కొన్ని ప్రాంతాల్లో సదర్ ఘనంగా జరగగా.. రెండో రోజులో భాగంగా ఇవాళ ఖైరతాబాద్, సైదాబాద్, బోయిన్పల్లి, కాచిగూడ, ఈస్ట్ మారెడ్‌పల్లి సహా మరికొన్ని ప్రాంతాలతో పాటు.. […]
తెలంగాణ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూసిన హుజురాబాద్ ఉప ఎన్నికలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ విజయం సాధించారు.. ఇక, ఈ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత తొలిసార బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రాబోతున్నారు ఈటల.. ఘన విజయం తర్వాత బీజేపీ హెడ్ క్వార్టర్స్‌కు వస్తున్న ఈటలకు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నాయి పార్టీ శ్రేణులు.. తెలంగాణ ఆత్మగౌరవ విజయోత్సవ ర్యాలీ పేరిట శామీర్ పేట నుంచి ర్యాలీ చేపట్టనున్నారు.. మధ్యాహ్నం ఒంటి గంటకు శామీర్‌పేట నుంచి బయల్దేరనున్న ఆయన.. […]
చైనా-తైవాన్ వ్యవహారం సుదీర్ఘ కాలంగా కొనసాగుతూనే ఉంది.. తైవాన్ కూడా చైనాలో భాగమే. అది కచ్చితంగా మళ్లీ చైనాలో కలిసి తీరుతుంది. తైవాన్ ప్రజలు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకొని తీరాల్సిందే.. లేని పక్షంలో సైనిక బలగాలను ఉపయోగించేందుకూ వెనకాడం అంటూ గతంలోనే హెచ్చరించారు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్… ఇక, తాజాగా మరోసారి ఈ వ్యహారం తెరపైకి వచ్చింది.. ఈ వివాదంలో అమెరికా కూడా జోక్యం చేసుకుంటాం అంటోంది.. ఈ నేపథ్యంలో.. కీలక ప్రకటన చేసింది […]
కరోనా కట్టడిపై పోరాటంలో భాగంగా భారత్‌లో కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.. మరికొన్ని దేశాలకు కూడా కోవాగ్జిన్ ఎగుమతి చేశారు.. ఇక, ఈ మధ్యే గుడ్‌న్యూస్ చెబుతూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ భారతీయ కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక, అగ్రరాజ్యం అమెరికాలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది.. 2-18 ఏళ్లులోపు వారికి కూడా కోవాగ్జిన్ తయారు చేసింది భారత్ బయోటెక్.. పిల్లలకు కోవాగ్జిన్ టీకా వేయడానికి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ […]
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కొరడా దెబ్బలు తిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. అదేంటి సీఎంకు కొరడా దెబ్బలు ఏంటి? అనే అనుమానం వెంటనే కలుగొచ్చు.. ఏ ఆలయానికైనా వెళ్లినప్పుడు.. అక్కడ నమ్మకాలు, భక్తుల విశ్వాసం మేరకు కొన్ని చేస్తుంటారు.. అలాంటే నమ్మకాన్నే ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ ఫాలో అయ్యారు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. Read Also: కోమటిరెడ్డి బ్రదర్స్‌ను కలుపుకుపోవాలి.. నేను మాట్లాడుతా.. ఛత్తీస్‌గఢ్ లోని […]
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు.. పీసీసీ చీఫ్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించినా.. అది దక్కించుకోలేకపోయారు పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంటకర్రెడ్డి, మరోవైపు.. ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తన అభిప్రాయాలను కుండబద్దలుకొట్టేస్తుంటారు.. ఇక, పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. టి.పీసీసీ.. కోమటిరెడ్డి మధ్య గ్యాప్ కొనసాగుతూనే ఉంది. అయితే, కోమటిరెడ్డి బ్రదర్స్‌తో తాను మాట్లాడుతా అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, […]