పీఆర్సీ నివేదిక విడుదల చేయాలంటూ సచివాలయంలోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు.. పీఆర్సీ నివేదిక బహిర్గతం చేసే వరకు ఇక్కడి నుంచి కదలబోమంటూ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే.. సీఎంను కలిసి సీఎస్ చర్చించిన తర్వాత నివేదిక విడుదల చేస్తారని భావించినా ఉద్యోగ సంఘాలకు నిరాశ ఎదురైంది.. అయితే, పీఆర్సీ ప్రక్రియ ప్రారభమైందని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.. మరోవైపు రేపు పీఆర్సీపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఎందుకంటే.. రేపు […]
అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర కొనసాగుతోంది… అయితే, ఈ పాదయాత్రలో పాల్గొనకుండా.. టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తూ వస్తున్నారు పోలీసులు.. ఇక, ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. రైతుల మహాపాదయాత్రకు వస్తున్న స్పందన చూసి జగన్‌కు చలి జ్వరం పట్టుకుందని వ్యాఖ్యానించిన ఆయన.. మహాపాదయాత్ర రాజకీయ యాత్ర కాదు.. భావితరాల భవిష్యత్ యాత్రగా అభివర్ణించారు.. రాజధాని మార్పుపై ఇచ్చిన మాటను తప్పినందుకు జగన్ సహా వైసీపీ నేతలందరూ […]
మంచిర్యాల జిల్లాలో సింగరేణి గనిలో మరో ప్రమాదం జరిగింది.. బుధవారం మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ డివిజన్ ఎస్సార్పీ 3 గనిలో ఉదయం గని పైకప్పు కూలిన ఘటనలో నలుగురు కార్మికులు ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే.. గనిలోని 21 డిప్ 24 లెవల్, 3ఎస్పీ 2 సీం వద్ద గని పైకప్పు రక్షణ చర్యలు చేపడుతున్న టింబర్‌మెన్ బేర లచ్చయ్య, సపోర్ట్‌మెన్ వీ క్రిష్ణారెడ్డి, బదిలీ వర్కర్లు గడ్డం సత్యనర్సింహారాజు, రెంక చంద్రశేఖర్ మృతిచెందారు.. […]
రోడ్డు ప్రమాదం 10 మంది భక్తులను పొట్టనబెట్టుకున్న ఘటన అసోంలో జరిగింది.. ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అసోంలోని కరీంగంజ్ జిల్లా బైతఖల్ వద్ద భక్తులతో వెళ్తున్న ఆటోను సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 10 మంది మృతిచెందారు. ప్రమాద ధాటికి ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు.. ఈ […]
వందేళ్ల క్రితం దొగిలించబడిన అన్నపూర్ణ దేవి విగ్రహం తిరిగి భారత్‌కు రప్పించింది కేంద్ర ప్రభుత్వం.. 18వ శతాబ్దానికి చెందిన అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించారు. వదేళ్ల క్రితం చోరీకి గురైన ఈ విగ్రహాన్ని కెనడాలో గుర్తించారు. కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన కేంద్రం.. చివరకు అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని వెనక్కి తీసుకువచ్చింది. ఇక, మాత అన్నపూర్ణా దేవి యాత్ర పేరుతో 4 రోజులపాటు విగ్రహంతో శోభాయాత్ర […]
ఆంధ్రప్రదేశ్‌ను విద్యలో ప్రత్యేక స్థానంలో నిలబెట్టేందుకు చిత్త శుద్ధితో కృషి చేస్తున్నాం.. ఐదు, పదేళ్లలో హైలీ ఎడ్యుకేటెడ్ రాష్ట్రంగా ఏపీ ఉంటుందన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. వైసీపీ కార్యాలయంలో జరిగిన మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకల్లో.. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎయిడెడ్ విద్యా సంస్థల విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉందన్నారు.. ఎవరిపై ఎలాంటి ఒత్తిడి […]
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి… గంటకు 27 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతున్న వాయుగుండం.. చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 300 కిలోమీటర్లు, పుదుచ్చేరికి తూర్పు-ఆగ్నేయంగా 280 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది.. కారైకాల్ – శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తుండగా.. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.. నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాలపై […]
వాయుగుండం ప్రభావంతో తమిళనాడు సర్కార్ అత్యవసర ఉత్తర్వులు జారీ చేసింది.. చెన్నై నగరంలో ఉన్న అన్ని సబ్‌వేలను మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. మరో రెండు రోజులపాటు నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.. ప్రజలు ఎవరు బయటికి రావొద్దని సూచించారు. ఇక, లోతట్టు ప్రాంతాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు వరద ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు అధికారులు.. కాగా, […]
ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ప్రేమోన్మాది దాడి కేసులో పోలీసు దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు… ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన యువతి ప్రస్తుతం ఎల్బీనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం చంద్రకల్‌కు చెందిన యువతికి, అదే గ్రామానికి చెందిన బస్వరాజ్తో కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడింది.. అది కాస్త ప్రేమగా మారింది. ఆ ఇద్దరు హైదరాబాద్‌కు […]
నోబెల్ పురస్కార గ్రహీత, పాక్ హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్ కొత్త జర్నీని ప్రారంభించారు.. వివాహ బంధంలోకి అడుపెట్టారు.. 24 ఏళ్ల మలాలా… అసర్ మాలిక్ అనే వ్యక్తిని నిఖా చేసుకున్నారు.. ఆయన ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో పనిచేస్తున్నారు.. బర్మింగ్‌హామ్‌లోని తన ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహ వేడుక నిరాడంబరంగా జరిగింది. ఇక, ఆ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన మలాలా.. ‘ఈ రోజు నా జీవితంలో ఎంతో […]