డబ్బుల గురించి ఓ సినిమాలో హీరో పాడినట్టుగా.. బతుకు బండిని నడేపేది పచ్చనోటే.. డబ్బును బట్టి మనిషికి స్టేటస్ మారిపోతోంది.. ఇచ్చే విలువ కూడా మారుతుంది.. పేరు వెనుక లేని తోకలు కూడా వచ్చి చేరుతాయి.. అయితే, ఇప్పుడు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే డబ్బులపై హాట్ కామెంట్సల్ చేశారు.. మానకొండూరు నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండల కేంద్రంలో దళిత బంధుపై నిర్వహించిన అవగాహన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.. మనిషికి డబ్బు చాలా ముఖ్యం అన్నారు.. తెలంగాణ రాక ముందు ఆడపిల్లలను అంగట్లో సరుకుల్లాగా అమ్మేవారంటూ పాత రోజులకు గుర్తుచేసుకుని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. దళిత కుటుంబాలకు పెళ్లి చేసే స్తోమత లేకపోవడంతో పురిట్లోనే డాక్టర్లకు డబ్బులు ఇచ్చి తీసివేసేవారన్నారు.. ఇక, పైసలు లేకపోతే ఎవ్వడూ దేకడు.. ఎవ్వడూ కానడు… పైసలు లేకపోతే ఏం చేయలేమని.. మనిషికి డబ్బు చాలా ముఖ్యమని తెలిపారు. కాగా, తెలంగాణ సీఎం కేసీఆర్ దళితుల కోసం దళితబంధు పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.. రాష్ట్రవ్యాప్తంగా.. దపదఫాలుగా ఈ పథకాన్ని అమలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.
Read Also: రేపు అన్ని పీఎస్‌లలో కేసీఆర్‌పై ఫిర్యాదులు.. సోమవారం పార్లమెంట్‌లో దీక్ష..!