ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది… ఇక, మంగళవారం పోలింగ్ జరిగిన 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓట్లను ఇవాళ లెక్కించనున్నారు.. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం వెల్లడించింది.. ఎంపీటీసీ స్థానాల ఫలితాలు ఉదయం 10 గంటల కల్లా తేలిపోనుండగా.. జెడ్పీటీసీ స్థానాల్లో మధ్యాహ్నం 12 గంటలకల్లా తుది ఫలితం వెలువడే అవకాశాలున్నాయి.. అయితే, నిన్నటి […]
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.. రోడ్డు ప్రమాదానికి గురై రాత్రి సమయంలో సాయం కోసం ఎదురుచూస్తున్నవారికి బాసటగా నిలిచారు.. తన కాన్వాయ్‌లోనే ఆస్పత్రికి తరలించారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే బుధవారం రాత్రి సమయంలో మియాపూర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు.. హకీంపేట దగ్గర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.. గాయాలపాలై సాయం కోసం ఎదురుచూస్తోన్న సమయంలో.. అటుగా వెళ్తున్న మంత్రి కేటీఆర్.. ఆ దృశ్యాలను గమనించారు.. వెంటనే కాన్వాయ్‌ని ఆపి కిందికి దిగారు.. విద్యార్థులను […]
మేషం : ఈ రోజు మీ జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. హామీలు, మధ్యవర్తిత్వాల వల్ల ఇబ్బందు లెదుర్కుంటారు. ఆత్మీయులు, బంధువుల రాకతో ఇల్లు కళకళలాడుతుంది. మీ గౌరవ ప్రతిష్ఠకు భంగం కలుగకుండా వ్యవహరించండి. వృషభం : ఈరోజు ఈ రాశిలోని రవాణా రంగాలలోని వారికి ఏకాగ్రత అవసరం. ప్రముఖ కంపెనీల షేర్ల విలువలు నష్టాల బాటలో సాగుతాయి. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల ఏకాగ్రత అవసరం. స్త్రీలకు నరాలు, ఎముకలు, […]
వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌పై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి.. బీజేపీ, కాంగ్రెస్ మాత్రమేకాదు.. మరోసారి యూపీ సీఎం పీఠాన్ని అధిరోహిస్తామంటూ ప్రజల్లోకి వెళ్తోంది సమాజ్‌వాది పార్టీ.. కానీ, ఎన్నికల ముందు.. ఎస్పీకి షాక్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ.. ఆ పార్టీకి చెందిన కీలక మహిళా నాయకురాలు రమా నిరజంన్ సహా మొత్తం నలుగురు ఎమ్మెల్సీలు.. ఎస్పీకి గుడ్‌బై చెప్పారు.. ఇవాళ బీజేపీ గూటికి చేరారు.. రమా నిరంజన్‌తోపాటు ఆమె భర్త కూడా బీజేపీలో […]
ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది.. టీడీపీ డీలాపడిపోగా.. వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి… ఈ ఫలితాలపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. ఏ ఎన్నికలు వచ్చినా వార్ వన్‌సైడే అన్నారు.. ఈ ఎన్నికల్లో నలబై ఏళ్ల ఇండ్రస్టీ అయినా చంద్రబాబుని తరిమి కొట్టారని సెటైర్లు వేసిన ఆమె.. కుప్పంలోనే ఇల్లు లేని చంద్రబాబును… హైదరాబాదు ఇంటికి పరిమితం చేశారని వ్యాఖ్యానించారు… ఇకనైనా చంద్రబాబు, లోకేష్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని […]
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగుతోంది.. మెజార్టీ మున్సిపాలిటీలు కైవసం చేసుకుంది అధికార పార్టీ.. దీంతో పార్టీ శ్రేణుల్లో జోష్ మరింత పెరిగింది.. సంబరాల్లో మునిగిపోయాయి వైసీపీ శ్రేణులు.. అయితే, ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంపై ప్రత్యేకంగా దృష్టిసారించింది.. ఇక, కుప్పంలో కూడా వైసీపీ తిరుగులేని విజయాన్ని అందుకుంది.. ఈ ఎన్నికలపై ఫలితాలపై మీడియాతో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి.. రాష్ట్రంలో […]
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలకు జరుగుతోన్న ఉప ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.. టీడీపీ అధినేత నియోజకవర్గంలోని కుప్పంలో కూడా వైపీపీ ఘన విజయాన్ని అందుకుంది.. ఈ ఫలితాలపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభంజనం.. చంద్రబాబు కుప్పం కోట బద్దలు అయ్యిందన్నారు.. ఇక, టీడీపీ ఆఫీసును అద్దెకు ఇచ్చుకోవాల్సిందేనంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు హైదరాబాద్ వెళ్లి మనవడితో ఆడుకుంటే […]
వైద్య వృత్తిలో ఉండి రాజకీయాల్లో అడుగుపెట్టి విజయం సాధించినవారు ఎంతో మంది ఉన్నారు.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సీఎంలుగా, కేంద్ర మంత్రులుగా సేవలు అందించినవారు.. ప్రస్తుతం అందిస్తున్నవారు కూడా ఉన్నారు.. ఇక, తాము ప్రయాణం చేస్తున్న సమయంలో.. తోటి ప్రయాణికులు అస్వస్థతకు గురైతే.. వెంటనే స్పందించి.. వారికి వైద్యం అందించి ప్రాణాలు నిలిపినవారు కూడా ఉన్నారు.. తాజాగా, వృత్తిరీత్యా డాక్టర్ అయిన కేంద్ర మంత్రి భగవత్ కరాడ్.. తోటి ప్రయాణికుడికి సకాలంలో చికిత్స అందించి ప్రాణాలు నిలిపారు.. […]
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.. దీంతో.. వెంటనే ఆయనను చికిత్స కోసం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించారు.. ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు బిశ్వభూషన్.. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉన్నట్టు తెలుస్తుంది.. అయితే, ఆయనకు వచ్చిన అనారోగ్య సమస్యలు ఏంటి..? ప్రస్తుతం ఎలా ఉన్నారు.. ఏ చికిత్స జరుగుతోంది..? లాంటి విషయాలు మాత్రం ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన తర్వాతే తెలియనున్నాయి. ఆయన […]