దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.. దీనిపై సుప్రీంకోర్టు సైతం స్పందించిన విషయం తెలిసిందే కాగా… ఆ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది… ఢిల్లీతో పాటు సమీప నగరాల్లో కూడా స్కూళ్లు, కాలేజీలను మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఆదేశాలు ఇచ్చింది. సాధారణంగానే ఈ సమయంలో ఢిల్లీలో వాయుకాలుష్యం ఎక్కువగా ఉంటుంది.. ఇక, దీపావళి నుంచి ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వాయు […]
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం మళ్లీ మహమ్మారి పెరుగుతోంది… ఇక, జమ్ములోనూ రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పైకి కదులుతోంది.. దీంతో.. అప్రమత్తమైన అధికారులు కర్ఫ్యూ విధించారు… కరోనా కట్టడిలో భాగంగా.. ఇవాళ్టి నుంచి రాత్రిపూట కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని అధికారులు వెల్లడించారు.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉటుందని.. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఉంటుందని తెలిపారు.. […]
ఏ కూరలోనైనా టమాటా ఉండాల్సిందే.. ఉల్లి గడ్డతో పాటు టమాటాకు కూడా ప్రాధాన్యం ఉంటుంది.. అయితే, టమాటా ధర ఇప్పుడు సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది.. గత నెలలో గరిష్ఠంగా కిలో 30 రూపాయలు పలికిన టమాటా ధర.. బహిరంగ మార్కెట్లో 40 రూపాయల వరకు అమ్ముడు పోయింది.. అయితే, వర్షాలతో టమాటా పంట దెబ్బతినడంతో.. మార్కెట్‌కు వచ్చే పంట కూడా తగ్గిపోయింది.. దీంతో టమాటా ధర క్రమంగా పైపైకి కదులుతోంది.. Read Also: తన జన్మదిన వేడుకల్లో […]
ఎవరు ఎప్పుడు ఎలా మరణిస్తారో చెప్పలేని విషయమే.. కొందరు విధి నిర్వహణలో ఉండగానే ప్రాణాలు విడిచిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.. ఆడుతూపాడుతూ కన్నుమూసినవారు కూడా లేకపోలేదు.. అయితే, ఓ స్వామీజీ తన పుట్టినరోజు నాడే కన్నుమూశారు.. అది కూడా తన జన్మదిన వేడుకల్లోనే ప్రాణాలు విడిచారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో బలోబలం మఠం ఉంది.. ఆ పీఠాధిపతి అయిన సంగనబసవ మహాస్వామీజీ.. ఇటీవల జరిగిన తన జన్మదిన వేడుకలకు హాజరైన భక్తులను ఉద్దేశించి […]
మైసూరును పాలించిన టిప్పుసుల్తాన్ సింహాసనాన్ని వేలం వేసింది బ్రిటన్ ప్రభుత్వం.. సింహాసనంలోని ముందరి భాగాన్ని వేలానికి పెట్టారు.. వజ్రాలతో పొదిగిన పులి తల ఆకృతిని భారత కరెన్సీలో దాదాపు రూ.15 కోట్లకు వేలానికి పెట్టింది. వేలంలో ధరను £1.5 మిలియన్లుగా నిర్ణయించింది.. మన కరెన్సీ ప్రకారం.. రూ. 14,98,64,994కు వేలం వేస్తోంది.. 18వ శతాబ్దంలో భారత్‌లోని మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్.. అయితే, భారత్ నుంచి ఎత్తుకెళ్లిన అమూల్యమైన సంపదను ఇలా బ్రిటన్ బహిరంగంగా వేలం వేయడంపై […]
కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలు పూర్తిగా రద్దు అయ్యాయి.. కొన్ని ప్రత్యేక విమాన సర్వీసులకు మాత్రమే ఆయా దేశాలు అనుమతి ఇస్తూ వచ్చాయి… ఇక, కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో.. ఒక్కో దేశం అంతర్జాతీయ ప్రయాణికులకు అనుమతి ఇస్తూ వస్తున్నాయి.. తాజాగా వివిధ దేశాల ప్రజలకు సింగపూర్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. నవంబరు 29వ తేది నుంచి ఇండోనేషియా, భారత పౌరులు సింగపూర్‌కి ప్రయాణం చేయవచ్చు.. అంతేకాదు.. డిసెంబరు 6వ తేదీ నుంచి […]
అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ కంట్రీ చైనా మధ్య ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంది.. తాజాగా, తైవాన్ విషయంలోనూ రెండు అగ్రరాజ్యాల మధ్య వార్నింగ్‌ల పర్వం నడుస్తోంది.. తైవాన్ స్వాతంత్ర్యానికి అమెరికా మద్దతివ్వడమంటే నిప్పుతో చెలగాటమాడినట్లే అంటూ తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు వార్నింగ్ ఇచ్చారు చైనా అధినేత జిన్ పింగ్.. ఈ విషయాన్ని చైనా మీడియా వెల్లడించింది… ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారిపోయింది.. జో బైడెన్, జిన్‌పింగ్ మధ్య […]
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాయిదా పడింది… షెడ్యూల్ ప్రకారం.. గురువారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా.. అంతకు ముందే.. అంటే రేపు (బుధవారం) రోజు కేబినెట్ సమావేశం నిర్వహించాలని భావించింది ప్రభుత్వం.. కానీ, ఆ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.. ఈ నెల 18న ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనుండడంతో.. అసెంబ్లీ ప్రారంభం కంటే ముందే.. కేబినెట్ సమావేశం నిర్వహించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.. ఇక, ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలక ఆర్డినెన్సులు అసెంబ్లీ ఆమోదానికి రానున్నాయి. […]
అవకాశం దొరికినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… ఇప్పటికే గంజాయి విషయంలో ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేశారు.. ఇక, ఈ మధ్యే విశాఖలో పర్యటించిన జనసేనాని.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మిక సంఘాలు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపారు.. అయితే, ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు పవన్ కల్యాణ్.. ఈ నెల 21న నరసాపురంలో పర్యటించనున్నారు.. […]