రూల్ అంటే రూలే.. అవి ఎవరు బ్రేక్ చేసినా వదిలేదు లేదు.. ట్రాఫిక్ నిబంధనలు ఎవరు పాటించకపోయినా ఫైన్ తప్పదని హెచ్చరిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.. ఒకప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించనివారిని అక్కడే ఆపి కౌన్సిలింగ్ ఇవ్వడం, చలానాలు రాయడం జరిగేది.. కానీ, ఇప్పుడు రూట్ మార్చేశారు ట్రాఫిక్ పోలీసులు.. కూడళ్ల దగ్గర ఓ పక్కన నిలబడి ట్రాఫిక్ రూల్స్ పాటించనివారిని ఫొటో తీసి చలానాలు వడ్డిస్తున్నారు. ఇక, ఉన్నతాధికారులకు అక్కడక్కడ మినహాయింపులు ఇచ్చేవారేమో.. కానీ, ఇప్పుడు కామారెడ్డి […]
అస్వస్థతకు గురై హైదరాబాద్ వచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను మరోసారి పరామర్శించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగా.. శాసనసభ విరామ సమయంలో గవర్నర్‌ను ఫోన్లో పరామర్శించిన సీఎం.. ఆయన ఆరోగ్య పరిస్ధితిపై ఆరా తీశారు.. నిన్ననే వైద్యులతో ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడానని.. సరైన సమయంలో ఆస్పత్రిలో చేర్చినట్లు వైద్యులు చెప్పారనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు సీఎం వైఎస్ జగన్. […]
కొన్ని సినిమాల్లో చూశాం.. అధికారిగా ఉన్న హీరోను ఉగ్రవాదులు కిడ్నాప్ చేయడం.. అతడిని విడిపించడానికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేసి విఫలం అవ్వడం.. ఇక, నేరుగా భార్యే రంగంలోకి దిగి.. ఉగ్రవాదుల నుంచి తన భర్తను విడిపించుకోవడం.. ఇలాంటి ఘటనే ఒకటి ఇప్పుడు వెలుగు చూసింది.. మావోయిస్టులు కిడ్నాప్ చేసిన తన భర్తను విడిపించడానికి అధికారులు, ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో.. తన కొడుకుతో అడవికి వెళ్లి.. తన భర్తను కాపాడుకుంది ఓ ఇల్లాలు.. ఈ ఘటనకు […]
ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎప్పటి నుంచో వజ్రాల కోసం వేట కొనసాగిస్తున్నారు ప్రజలు.. వజ్రాలు దొరికి కొందరు లక్షలు సంపాదిస్తే.. కొందరు కోటీశ్వరులు అయ్యారని చెబుతారు.. ఇక, చాలా మందికి నిరాశే మిగిలింది.. అయితే, ఉన్నట్టుండి ఇప్పుడు ఉప్పాడ సముద్ర తీరప్రాంతంలో బంగారపు నగలు దొరుకుతున్నాయనే మాట.. స్థానికుల చెవినపడింది.. దీంతో.. గత రెండు రోజులుగా ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో బంగారం కోసం జల్లెడ పడుతున్నారు స్థానిక మత్స్యకారులు.. మహిళలు, చిన్నారులు సైతం తీరంలో బంగారం […]
రైతులు పండించిన పంట కొనుగోళ్ల విషయంలో తెలంగాణ సర్కార్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వంగా మారింది పరిస్థితి… రాష్ట్ర బీజేపీ నేతలు టీఆర్ఎస్ సర్కార్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్న ఆ పార్టీ నేతలు.. కేంద్రం చెప్పేది ఒకటైతే.. రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం మరో మార్గం ద్వారా రైతులను మోసగించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు.. ఇక కేంద్రంపై యుద్ధం ప్రకటించి మహాధర్నాకు దిగారు గులాబీ పార్టీ దళపతి కేసీఆర్.. అయితే.. ఈ ధర్నాపై కాంగ్రెస్ పార్టీ […]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 26వ తేదీ వరకు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.. అయితే, తాజాగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఏసీలో ఆసక్తికరమైన చర్చే సాగింది.. గెలుపు ఓటముల నుంచి.. మొహాలు చూసుకునే వరకు.. మీరు ఓడారంటే.. మీరు ఎలా గెలిచారో అందరికీ తెలుసంటూ.. ఇలా అధికార ప్రతిపక్ష నేతల మధ్య చాలా సేపే చర్చ సాగింది.. కుప్పం, నెల్లూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఏసీలో ప్రస్తావనకు రాగా… సభకు చంద్రబాబును […]
సాధారణంగా బయట ఏ4 సైజు పేపర్‌ను వాడితే.. కోర్టులు, రిజిస్ట్రేషన్ కార్యాలయలు.. ఇతర కొన్ని ప్రభుత్వ ఆఫీసుల్లోనూ ఏ4 కంటే కాస్త పొడవైన పేపర్లు వాడుతుంటారు.. అయితే, హైకోర్టులో ఏ4 సైజు పేపర్‌ను ఉపయోగించడంపై బాంబే హైకోర్టులో విచారణ జరిగింది.. తెలంగాణ హైకోర్టు మరియు అన్ని సబార్డినేట్ కోర్టులలో అన్ని న్యాయపరమైన ప్రయోజనాల కోసం రెండు వైపులా రాసిన ఏ4 సైజు పేపర్లను మాత్రమే ఉపయోగించాలంటూ మయూర్ ముంద్రా అనే న్యాయవాది రిట్ పిటిషన్ దాఖలు చేశారు.. […]
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది.. ఈ కేసులో తాజాగా మరో వ్యక్తిని అరెస్ట్ చేసింది సీబీఐ.. హైదరాబాద్‌లో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు… ఈ కేసులో డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే కాగా.. వివేకాను హత్య చేస్తే 40 కోట్లు ఇస్తారంటూ వివేకా అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పాడని దస్తగిరి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు.. అయితే, […]
వంటింట్లో టమాటా ఉండాల్సిందే..! ప్రతీ కూరలోనూ టమాటా వాడాల్సిందే..! అప్పుడే ఆ కూరకు టెస్ట్ వస్తుంది.. కానీ, ఇప్పుడు టమాటా దొరకడమే కష్టంగా మారే పరిస్థితి కనిపనిస్తోంది.. ఎందుకంటే.. ఎప్పుడూ మార్కెట్‌కు పెద్ద ఎత్తున తరలివచ్చే టమాటా ఇప్పుడు కనిపించడంలేదు.. మార్కెట్లు, రైతు బజారుల్లోనూ టమాటా జాడ కోసం వెతకాల్సిన పరిస్థితి వచ్చింది.. మరోవైపు.. టమాటా ధర క్రమంగా పైకి కదులుతోంది.. దీంతో.. సూపర్ మార్కెట్లు నేరుగా రైతు దగ్గరకే వెళ్లి టమాటాలు కొనేస్తున్నారు. క్రమంగా సూపర్ […]
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి.. మాజీ మావోయిస్టులు, మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు.. హైదరాబాద్‌లోని మాజీ మావోయిస్టు రవిశర్మ ఇంట్లో సోదాలు నిర్వహించారు.. ప్రకాశం జిల్లాలో విరసం నేత కళ్యాణ్ రావు ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి.. మావోయిస్టు పార్టీ చర్చల ప్రతినిధిగా కొనసాగిన కళ్యాణ్ రావు ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.. ఇక, విశాఖపట్నంలోని అనురాధ ఇంట్లో సోదాలు చేస్తున్నారు.. మావోయిస్టులతో సంబంధాలపై ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది.. అంతేకాదు, […]