AP Liquor Scam Case: ఎంపీ మిథున్‌రెడ్డి వ్యవహారంలో కీలక మలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఏపీ మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు పాక్షికంగా అనుమతించింది. బెయిల్ ఉత్తర్వుల్లో ఏసీబీ కోర్టు తన విచారణ పరిధి దాటి పలు అంశాలను ప్రస్తావించిందని పేర్కొంది. కోర్టు వెల్లడించిన అభిప్రాయాలు కేసు దర్యాప్తుకు ఆటంకం కలిగించేలా ఉన్నాయని తెలిపింది. కేసు దర్యాప్తు ఇంకా పూర్తికాలేదని, మిథున్ రెడ్డి విషయంలో దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయలేదని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి బెయిల్ ఉత్తర్వుల్లో ఏసీబీ కోర్టు ప్రస్తావించిన పలు అంశాల అమలును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే బెయిల్‌ను రద్దు చేయడానికి నిరాకరించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి Justice Venkata Jyothirmayi శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు.
మద్యం కుంభకోణం కేసులో నిందితుడు, వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడడి (ఏ4)కి బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు గత ఏడాది సెప్టెంబర్ 29న ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సీఐడీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రాసిక్యూషన్ తరఫున సీనియర్ న్యాయవాదులు Siddharth Luthra, Siddharth Agarwal వాదనలు వినిపిస్తూ… ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పులో ప్రస్తావించిన పలు అంశాలు కేసు దర్యాప్తు మొత్తాన్ని బలహీనపరిచేలా ఉన్నాయని తెలిపారు. మిథున్ రెడ్డి విషయంలో దర్యాప్తు ఇంకా పూర్తికాలేదని, ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదని చెప్పారు.
Also Read
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
- Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
- BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
బెయిల్ ఉత్తర్వుల్లో మాత్రం కేసు దర్యాప్తు ముగిసినట్లు ఏసీబీ కోర్టు పేర్కొందన్నారు. గూగుల్ టేక్ అవుట్ సాంకేతిక ఆధారాన్ని, సీఆర్పీసీ సెక్షన్ 161, 164 కింద సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలను ఆధారాలుగా పరిగణించలేమని ఉత్తర్వుల్లో ప్రస్తావించిందన్నారు. ఏసీబీ కోర్టు న్యాయాధికారి వైఖరి విస్మయానికి గురి చేస్తోందన్నారు. మిథున్ రెడ్డి బెయిల్ ఉత్తర్వుల్లోని అంశాలను ఆధారంగా చేసుకుని తమకూ బెయిల్ మంజూరు చేయాలని ఇతర నిందితులు కోరే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో బెయిల్ ఉత్తర్వుల్లో ప్రస్తావించిన పలు అంశాల అమలును నిలిపివేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి, మిథున్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను పాక్షికంగా అనుమతిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?