ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులను బదిలీ చేస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్.. సీఎం పేషీలో అత్యంత కీలక పాత్ర పోషించిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్‌ను నిన్ననే బదిలీ చేసిన ప్రభుత్వం.. ఇవాళ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై వేటు వేసేందుకు సిద్ధమైపోయింది.. కొన్ని కేసుల విషయంలో విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా.. సవాంగ్‌ను కొనసాగిస్తూ వచ్చిన సర్కార్.. ఇప్పుడు అనూహ్యంగా బదిలీ చేసింది.. ఇక, కొత్త డీజీపీ ఎవరు ? అనేదానిపై కూడా జగన్ సర్కార్ క్లారిటీగానే ఉన్నట్టు సమాచారం.. ప్రస్తుతం ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న కసిరెడ్డి రాజేంద్ర నాథ్ రెడ్డిని డీజీపీగా నియమించేందుకు కసరత్తు పూర్తిచేసినట్టుగా తెలుస్తోంది.. దీనిపై ఇవాళ అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు.. మరి గౌతమ్ సవాంగ్ బదిలీకి కారణాలు ఏంటి? అనేది మాత్రం పెద్ద చర్చగా మారింది..