కరోనా వల్ల పల్స్ పోలియో వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని.. ఇప్పుడు పరిస్థితి అదుపులోకి రావడంతో మళ్లీ పోలియో చుక్కలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం.. వచ్చే మూడు రోజులు పోలియో చుక్కల కార్యక్రమం ఉంటుందని తెలిపారు మంత్రి హరీష్‌రావు.. పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 20 వేల సెంటర్లలో పోలియో కార్యక్రమం చేపట్టామని.. అంతేకాకుండా ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు చిన్నపిల్లలకు వేయాలని సూచించారు.. ఈ సారి 28 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్నామన్న ఆయన.. అనేక మంది పోలియోతో ఇబ్బందులు పడుతున్నారు.. అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 ఏళ్ళ పిల్లల వరకు అందరికీ పోలియో డ్రాప్స్ వేయాలని తెలిపారు.
Read Also: Blast: హైదరాబాద్ శివారులో పేలుడు, మహిళ మృతి
పోలియో డ్రాప్స్ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది.. ఏ కార్యక్రమం చేపట్టినా తెలంగాణ ముందుంటుందన్నారు మంత్రి హరీష్‌రావు.. కరోనా వ్యాక్సిన్ లో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని ఈ సందర్భంగా గుర్తుచేసిన ఆయన.. కరోనా వాకిన్స్ వేసుకోని వారు ఇప్పుడైనా వేసుకోవాలని సూచించారు.. ఇక, బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం.. మిగిలిన చోట కూడా బస్తీ ధవాఖానాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం.. బస్తీ ధవాఖానాలు ఏర్పాటుతో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు.. వైద్య సేవలతో పాటు, మందులు కూడా ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. బస్తీ ధవాఖానాలు సాయంత్రం కూడా తెరవాలని సూచించాం.. వైద్యా సేవలు ఎప్పుడైనా అందుబాటులో ఉంచాలని ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు మంత్రి హరీష్‌రావు.