Russia Ukraine War: కీవ్ సిటీ మా ఆధీనంలోనే ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్‌లో భీకర యుద్ధం కొనసాగుతోంది. బాంబుల మోత.. సైరన్ హెచ్చరిక.. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ. రాత్రి, పగలు తేడా లేదు, నిద్రాహారాలు లేవు. గత నాలుగు రోజులుగా ఉక్రెయిన్‌లో ఇదే పరిస్థితి. ఎక్కడ బాంబు పడుతుందో… ఏవైపు నుంచి మిసైల్స్ దూసుకొస్తాయో.. తెలియదు. రష్యా దాడులకు ధీటుగా ఎదుర్కొంటోంది ఉక్రెయిన్ సైనం. ప్రజలు సైతం… ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ఎక్కడి కక్కడ రష్యా సైనికులను అడ్డుకుంటున్నారు. రష్యా దాడికి నిరసనగా రోడ్లపై నిరసన తెలుపుతున్నారు.
Read Also: Kodali Nani: సీపీఐ నారాయణ ఓ వింత జంతువు..!
Also Read
రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్న… రష్యాకు ఉక్రెయిన్ ధీటుగా జవాబిస్తోంది. రష్యా బలగాలపై ఉక్రెయిన్ సైన్యం ఎదురుదాడికి దిగింది. రష్యన్ ఆర్మీకి చెందిన IL-76 ఎయిర్‌క్రాఫ్ట్‌ను కూల్చివేశాయి ఉక్రెయిన్ దళాలు. రష్యా అధ్యక్షుడు పుతిన్ గెలుపు కోసం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. వేటగాళ్లుగా పిలువబడే చెచెన్ ప్రత్యేక దళాలను కూడా పుతిన్…. యుద్ధ రంగంలోకి తీసుకువచ్చారని సమాచారం. ఉక్రెయిన్ అధికారులను పట్టుకుని చంపేయడం లేదా తమకు అప్పగించాలని చెచెన్ దళాలకు రష్యా ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే, ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోకి రష్యా భద్రతా బలగాలు ప్రవేశించాయన్న వార్తలపై ఉక్రెయిన్ ప్రభుత్వం వివరణ ఇచ్చింది.. కీవ్ పూర్తిగా తమ ఆధీనంలోనే ఉందని ఉక్రెయిన్ డిప్యూటీ హెడ్ అడ్మినిస్ట్రేషన్ మైకోలా పోవోరోజ్నిక్ ప్రకటించారు. కీవ్‌లో పరిస్థితి చాలా ప్రశాంతంగానే ఉందన్న ఆయన.. రాజధాని మొత్తం ఉక్రెయిన్ ఆర్మీ దళాల ఆధీనంలోనే ఉంది. పరిస్థితి పూర్తిగా మా అదుపులోనే ఉందన్నారు. ఇక, తమపై దాడులు చేయడానికి వచ్చిన రష్యా దళాలను ఉక్రెయిన్ ఆర్మీ అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?