YS Viveka Case: లోక్‍సభ స్పీకర్‌కు సునీతారెడ్డి లేఖ.. హత్యలో అవినాష్‌రెడ్డి హస్తం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో కలకలం సృష్టించిన మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇప్పుడు సంచలనంగా మారుతోంది.. ఇప్పటికే ఈ వ్యవహారంలో రాజకీయ విమర్శల పర్వం కొనసాగుతుండగా.. తాజాగా వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి సీబీఐ వాంగ్మూలంలో చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.. మరోవైపు.. ఈ వ్యవహాంలో లోక్‍సభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి… వివేకా హత్య కేసులో ఎంపీ ఆవినాష్ రెడ్డి హస్తం ఉందని లేఖలో స్పీకర్ దృష్టికి తీసుకెళ్లిన ఆమె.. ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇక, సీబీఐకి తానిచ్చిన వాంగ్మూలాన్ని స్పీకర్‌కు రాసిన లేఖతో జతపరిచారు సునీతారెడ్డి.. అంతేకాకుండా సీబీఐకి నిందితులిచ్చిన వాంగ్మూలాలను కూడా స్పీకర్‍కు అందజేశారు.
Read Also: YS Viveka Murder Case: సీబీఐ వాంగ్మూలం.. సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
ఇక, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కూతురు సునీతారెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలోని కీలక అంశాలను బయటపెట్టిన విషయం తెలిసిందే.. మా నాన్నను ఎవరు చంపారో అందరికీ తెలుసన్న ఆమె.. నాన్న హత్యపై వైఎస్ జగన్, వైఎస్ భారతి చాలా తేలిగ్గా స్పందించారని.. నాన్న హత్య విషయంలో జగనన్న వ్యాఖ్యలు బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు.. హత్య గురించి అనుమానితుల పేర్లను జగనన్నకు చెప్పా.. వాళ్లను ఎందుకు అనుమానిస్తున్నావు.. నీ భర్తే హత్య చేయించాడేమో అని అన్యాయంగా మాట్లాడారని.. కేసు సీబీఐకి అప్పగిస్తే అవినాష్‍కు ఏమీకాదు.. బీజేపీలో చేరతాడని చెప్పారని.. ఇప్పటికే మాపై 11 కేసులున్నాయి.. మీది 12వది అవుతుందన్నారని పేర్కొన్నారు. నా తండ్రి హత్యను వైఎస్ జగన్ రాజకీయ సానుభూతి కోసం వాడుకున్నారని సీబీఐకి తెలిపిన ఆమె.. సీబీఐ విచారణ కోసం నేను కోర్టుకు వెళ్తే జగన్ రాజకీయ భవిష్యత్తు.. నాశనమయ్యే ప్రమాదం ఉందని వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారని పేర్కొన్నారు.. అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డిల డైరెక్షన్‍లో ఆధారాలను మాయం చేశారని ఆరోపించారు.. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డిలతో పాటు మరికొందరు అనుమానితులను విచారిస్తే నిజాలు బయటపడతాయని సీబీఐకి తెలిపారు. నా తండ్రి అంటే ఎంపీ అవినాష్‌కు గిట్టదు అని పేర్కొన్నారు.. హంతకులకు శిక్ష పడాలని.. గత్యంతరం లేక సీబీఐని ఆశ్రయించానంటూ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు సునీతారెడ్డి.
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!