Russia-Ukraine War: రష్యాకు బిగ్ షాక్.. ఐవోసీ బహిష్కరణ వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి… ఫిఫా ప్రపంచకప్ 2022 నుంచి రష్యాపై బహిష్కరణ వేటు వేసింది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ).. అన్ని అంతర్జాతీయ టోర్నీల నుంచి రష్యాను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది.. తదుపరి నోటీసు వచ్చే వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని వెల్లడించింది. దీంతో.. రష్యాకు క్రీడలపరంగానూ భారీ దెబ్బ తగిలినట్టు అయ్యింది.. అంతర్జాతీయ టోర్నీల్లో రష్యన్ జట్లను అనుమతించొద్దని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ స్పష్టం చేసింది.. అంతే కాదు.. రష్యాకు మద్దతు తెలుపుతున్న బెలారస్ అథ్లెట్లను కూడా బహిష్కరించాలని పేర్కొంది. ఆ రెండు దేశాలకు చెందిన అథ్లెట్లను టోర్నమెంట్‌లలో ఆడకుండా చేయాలని సమావేశంలో ఐవోసీ నిర్ణయం తీసుకుంది.
Read Also: Adipurush: ‘ఆదిపురుష్’ రిలీజ్ డేట్ లాక్..
Also Read
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Kim Jong Un: కిమ్‌ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
ఇక, రష్యా, బెలారస్‌పై ఎందుకు బహిష్కరణ వేటు వేయాల్సి వచ్చింది వివరిస్తూ.. ప్రపంచ క్రీడా పోటీల సమగ్రతను కాపాడేందుకు.. క్రీడాకారుల భద్రత కోసం ఈ చర్యలు తీసుకోవాలి అని ఐవోసీ పేర్కొంది. ఉక్రెయిన్‌పై దాడితో బరువెక్కిన హృదయంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.. అంతర్జాతీయ పోటీలలో రష్యన్ మరియు బెలారస్ అథ్లెట్లు మరియు అధికారులను ఆహ్వానించవద్దని లేదా అనుమతించవద్దని అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలు మరియు స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వాహకులకు ఐవోసీ సిఫార్సు చేసింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ యొక్క ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మరోసారి చర్చించి ఈ నిర్ణయం తీసుకుంది.. సంస్థాగత లేదా చట్టపరమైన కారణాల వల్ల చిన్న నోటీసుతో ఇది సాధ్యం కానప్పుడు, అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలు మరియు ప్రపంచవ్యాప్తంగా క్రీడా ఈవెంట్‌ల నిర్వాహకులను రష్యా లేదా బెలారస్ నుండి ఏ అథ్లెట్ లేదా స్పోర్ట్స్ అధికారిని అనుమతించకుండా చూడాలని కోరింది.. రష్యన్ లేదా బెలారసియన్ జాతీయులు, అది వ్యక్తులు లేదా జట్లుగా అయినా, తటస్థ క్రీడాకారులు లేదా తటస్థ జట్లుగా మాత్రమే అంగీకరించబడాలి.. జాతీయ చిహ్నాలు, రంగులు, జెండాలు లేదా గీతాలు ప్రదర్శించబడకూడదని ఐవోసీ స్పష్టం చేసింది..
- Tags
తాజావార్తలు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
-
Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్‌లోకి సూర్య సినిమా
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!