ఉక్రెయిన్‌లో ఆరో రోజు రష్యా దాడులు కొనసాగుతున్నాయి. నిన్న ఎలాంటి ఒప్పందం లేకుండానే రష్యా-ఉక్రెయిన్ తొలివిడత చర్చలు అసంపూర్తిగా ముగియడంతో రష్యా దాడులను మరింత ఉధృతం చేసింది. మరో రెండు కీలక నగరాలను స్వాధీనం చేసుకునేందుకు పుతిన్ సేనలు ప్రయత్నిస్తున్నాయి. కీవ్ నగానికి 40 మైళ్ల దూరంలో రష్యా మిలెట్రీ కాన్వాయ్ ఉంది. దీనిపై శాటిలైట్ ఫోటోలు విడుదలయ్యాయి.. పుతిన్ సేనలు ఏమాత్రం.. వెనక్కి తగ్గడం లేదు. బాంబుల వర్షం కురిపిస్తోంది. దాడుల్లో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతోంది. మరోవైపు వేలాది మంది ఉక్రెయిన్లు దేశం విడిచి పొరుగు దేశాలకు వెళ్లిపోతున్నారు. రష్యా భీకర యుద్ధాన్ని ఎదుర్కొవడానికి ఉక్రెయిన్ శతవిధాల కృషి చేస్తోంది. అందుకే సైనిక నేపథ్యం ఉన్న ప్రతి ఒక్కరినీ యుద్ధ భూమిలోకి దించుతుంది. జైల్లో ఖైదీలుగా ఉన్న సైనికులను విడుదల చేసింది. అయితే వారు హత్యలు, దోపిడిలకు పాల్పడుతున్నారు.
Read Also: Russia-Ukraine War: 5 లక్షల మంది వలస