మహాశివరాత్రి సందర్భంగా తన ఫ్యాన్స్‌కు ‘ఆదిపురుష్’ రిలీజ్ డేట్ లాక్ చేస్తూ మంచి ట్రీట్ ఇచ్చారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక మూవీ ఆదిపురుష్‌పై ఎన్నో అంచనాలున్నాయి.. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ.. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది రిలీజ్ కావాల్సి ఉన్నా… తాజాగా, ఆ డేట్‌ను ఫిక్స్ చేస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.. జనవరి 12న 2023 సినిమా విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. మొత్తంగా వచ్చే ఏడాది సంక్రాంతికి కనువిందు చేయబోతోంది ఈ మూవీ.. ఇక, ఈ మూవీలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్ర పోషిస్తున్నారు.. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
Read Also: GDP: వృద్ధి రేటులో పురోగతి.. భారతే టాప్..!
ఇక, మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్రం నుంచి అప్‌డేట్ ఇవ్వబోతున్నట్టు సోమవారం రోజే తెలిపిన మేకర్స్.. మరోసారి ఆదిపురిష్‌ను ట్రెండింగ్‌లోకి తెచ్చారు.. మొత్తంగా ఇవాళ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేస్తూ ఓ పోస్టర్‌ను వదిలి.. డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ ఇచ్చింది చిత్ర యూనిట్.. కాగా, ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కావాల్సి ఉండగా.. అమీర్ ఖాన్, నాగచైతన్య కీలక పాత్రలు పోషించిన లాల్ సింగ్ చద్దా చిత్రాన్ని అదే డేట్‌కి రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్.. ఆదిపురుష్‌తో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.. దీంతో.. వాయిదా పడిన ఆదిపురుష్‌కి శివరాత్రి సందర్భంగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. అయితే, ఈ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ ఎలా ఉండబోతున్నారు.. ఆయన గెటప్ ఎలా ఉంటుంది, రాముడిగా ఎలా ఉండబోతున్నారు అనే విషయంలో మాత్రం అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
