ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. మరోవైపు చర్చలు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే కాగా.. నిన్న జరిగిన మొదటి విడుదల చర్చలు విఫలం అయ్యాయి.. ఉక్రెయిన్‌లోని నగరాలపై క్రమంగా పట్టు సాధించేందుకు రష్యా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి.. కొన్ని చోట్ల తీవ్ర ప్రతిఘటన తప్పడం లేదు.. ఇక, రష్యాపై అంతర్జాతీయంగా ఆంక్షలు కొనసాగుతున్నాయి.. ఇక, రష్యా ఆక్రమణతో ఉక్రెయిన్ నుంచి ప్రజలు భారీగా వలస వెళ్తున్నారు.. దీంతో.. సరిహద్దు పాయింట్లు రద్దీగా మారాయి. కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. యుద్ధం మొదలయ్యాక ఉక్రెయిన్ నుంచి 5లక్షల మందికి పైగా ప్రజలు ఉక్రెయిన్ నుంచి వలస వెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి వలసల విభాగం వెల్లడించింది.. యూఎన్‌హెచ్‌సీఆర్ హై కమిషనర్ ఫిలిపో గ్రాండి ఈ విషయాన్ని ప్రకటించారు.. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతోందని తెలిపారు. కాగా, ఉక్రెయిన్‌లో ఉన్న వివిధ దేశాల విద్యార్థులు, పౌరులతో పాటు.. ఆ దేశ పౌరులు కూడా క్రమంగా వలస వెళ్లిపోతున్న విషయం తెలిసిందే.
Read Also: Russia-Ukraine War: రష్యాకు బిగ్ షాక్.. ఐవోసీ బహిష్కరణ వేటు