కొన్ని ప్రకృతి విపత్తులు అనుకోకుండా విరుచుకుపడతాయి.. అయితే, వాటి గుట్టును విప్పడానికి అనేక ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి.. ఇప్పటికే తుఫాన్లు ఎక్కడ పుడతాయి.. ఎక్కడికి వెళ్తాయి.. ఎక్కడ తీరం దాటతాయి అనేదానిపై నిర్దిష్టమైన అంచనాలు వచ్చేస్తున్నాయి.. ఇక, భూకంపానికి సంబంధిచిన హెచ్చరికలు కూడా ముందే వస్తున్నాయి.. తాజాగా, అమెరికాలోని భూకంపానికి సంబంధించిన హెచ్చరికలు ముందుగానే రాగా.. ఆ తర్వాత కొన్ని క్షణాల్లో భూకంపం వచ్చింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాలిఫోర్నియా రాష్ట్రంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. […]
సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు అగ్రరాజ్యాన్ని సైతం వణికిస్తోంది… యూఎస్‌లో పెద్ద సంఖ్యలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. గణాంకాలను పరిశీలిస్తే.. గత వారం రోజుల్లో నమోదైన మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల్లో 73 శాతం ఒమిక్రాన్ కేసులే ఉన్నాయంటే.. ఒమిక్రాన్ ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో అర్థం చేసుకోవచ్చు.. ఇక, న్యూయార్క్ ఏరియాలో తాజా కేసుల్లో 90శాతానికిపైగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులే ఉండడం కూడా ఆందోళన కలిగిస్తోంది.. గత వారం […]
ప్రపంచ దేశాలతో ఓ ఆటాడుకుంది కరోనా వైరస్.. లక్షలాది మంది ప్రాణాలను తీసింది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ రూపంలో విరుచుకుపడింది.. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో మరోసారి దాడి చేస్తోంది.. అయితే, కరోనా మందు పేరు చెప్పగానే తెలుగు రాష్ట్రాల్లో ఆనందయ్య పేరు వినబడుతోంది.. కరోనా సెకండ్ వేవ్ సమయంలో… ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందు.. పెద్ద చర్చగా మారింది.. పెద్ద సంఖ్యలో బాధితులు ఆనందయ్య మందు కోసం […]
నేటితో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి… ఓ వైపు 12 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్, మరోవైపు వివిధ సమస్యలపై ప్రతిపక్షాలు ఆందోళన, నిరసన కార్యక్రమాలతో హాట్ హాట్‌గా సాగిన పార్లమెంట్ సమావేశాల్లో కీలక బిల్లులను కూడా ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం.. అయితే, ఒక రోజు ముందుగానే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదాపడనున్నాయి.. ఇక, మంగళవారం సభలో ప్రవేశపెట్టిన “బాల్య వివాహాల నిషేధ (సవరణ) బిల్లు 2021”ను స్టాండింగ్ కమిటీకి పంపే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ కర్నూలులో పర్యటించనున్నారు.. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరనున్న ముఖ్యమంత్రి జగన్… ఆ తర్వాత కర్నూలు వెళ్లనున్నారు.. ఇక, ఉదయం 11.15 గంటలకు కర్నూలు విమానాశ్రయం చేరుకోనున్న ఆయన.. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా పంచలింగాల గ్రామానికి చేరుకోనున్నారు.. పంచలింగాలలో జరగనున్న పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడి వివాహానికి హాజరుకానున్నారు సీఎం వైఎస్ జగన్.. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో […]
విడాకుల తర్వాత భార్యకు భరణం చెల్లించే విషయంలోనూ కొత్త రికార్డు సృష్టించాడు దుబాయ్‌కి చెందిన ఓ రాజు.. బ్రిటన్ హైకోర్టు వెలువరించిన సంచలన తీర్పుతో.. ఆయన తన మాజీ భార్యకు ఏకంగా రూ.5,555 కోట్లను భరణంగా చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం వయస్సు 72 ఏళ్లు.. ఆయన భార్య జోర్డాన్ రాకుమారి హయా బింత్ అల్ హుసేన్ వయస్సు 47 ఏళ్లు.. ఈ […]
తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది.. ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.. ఒక, సాయంత్రం నుంచి చలి వణికిస్తోంది.. విశాఖ ఏజెన్సీలో రెండేళ్ల తర్వాత కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.. దీంతో విపరీతంగా చలితీవ్రత పెరిగిపోయింది.. పొగమంచుకు శీతల గాలులు తోడవ్వడంతో ఏజెన్సీ ప్రాంతాలు వణికిపోతున్నాయి.. ఈ సీజన్లో లంబసింగిలో జీరో డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. ఇక, ఇవాళ పాడేరు, అరకులో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు […]
భారత్‌లోనూ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి.. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్.. భారత్‌లో అడుగుపెట్టడమే కాదు.. కొన్ని రాష్ట్రాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది.. ఈ తరుణంలో రాష్ట్రాలకు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.. గతంలో భారత్‌తో పాటు అనేక దేశాలను అతలాకుతం చేసిన కోవిడ్ డెల్టా వేరియంట్‌ను మించి మూడురెట్ల వేగంతో వ్యాపిస్తోందని తెలిపింది.. ఒమిక్రాన్‌తో అప్రమత్తంగా ఉండాలని సూచించిన కేంద్రం.. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు […]
మేషం : ఈ రోజు ఈ రాశిలోని పోర్టు, ట్రాన్సుపోర్టు రంగాల వారికి పురోభివృద్ధి. ముఖ్య వ్యవహారాలను మరింత వేగవంతం చేస్తారు. కలప, ఐరన్, సిమెంటు, ఇటుక, ఇసుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. స్త్రీలకు విలాస వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో, అపరిచిత వ్యక్తుల […]