అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే విదేశీ పర్యాటకురాలిపై నెల్లూరు జిల్లాలో అత్యాచారయత్నం కలకలం సృష్టించింది.. అయితే, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఏపీ పోలీసులు…గంటల వ్యవధిలోనే అత్యాచాయత్నానికి పాల్పడిన దుండగులను అరెస్ట్ చేశారు. ఇక, ఈ ఘటనపై స్పందించిన బాధితురాలు కరోలినా.. ఇండియా చూద్దామని వచ్చా.. కానీ, ఇలా జరుగుతుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. చెన్నై నుంచి గోవాకు వెళ్తుండగా సాయి కుమార్ (నిందితుడు) పరిచయమయ్యాడని తెలిపిన ఆమె… ఆ తర్వాత సైదాపురం వద్ద నాపై అఘాయిత్యానికి ప్రయత్నించాడని వాపోయారు.. స్థానికుల సహకారంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లా.. పోలీసులు బాగా చూసుకున్నారని తెలిపిన ఆమె.. ఈ సందర్భంగా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసులు ఇద్దరినీ పట్టుకున్న పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.
Read Also: OTT Alert : 5 ఇంట్రెస్టింగ్ మూవీస్… డిజిటల్ రిలీజ్ కు రెడీ
ఇక, నేను ఒంటరిగానే చాలా దేశాలు తిరిగా.. యూరప్‌లోనూ పర్యటించానని తెలిపిన కరోలినా.. అలాగే ఇండియాకు వచ్చా.. ఇలా జరుగుతుందని అనుకోలేదన్నారు.. కాగా, నెల్లూరు ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. లిథువేనియా దేశానికి చెందిన కరోలినాకు నిందితుడు సాయికుమార్ బస్సులో పరిచయమయ్యాడు. ఆమెను మాయమాటలతో నమ్మించి నెల్లూరు జిల్లాలోని తన స్వగ్రామానికి తీసుకెళ్లాడని.. మరో స్నేహితుడు షేక్ అబిద్ తో కలిసి కరోలినాను సైదాపురం అడవుల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించారని.. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు స్థానికుల సాయంతో పోలీసులను ఆశ్రయించారని.. వెంటనే స్పందించిన కేవలం గంటల వ్యవధిలోనే నిందితులిద్దరినీ అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. ఇది దేశ ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారం.. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన గూడూరు పోలీసులను అభినందించారు నెల్లూరు ఎస్పీ. నిందితులపై కేసు నమోదు చేశామని వెల్లడించారు.. కరోలినా వరల్డ్ ట్రావెలర్.. దేశవిదేశాల్లో పర్యటిస్తూ అక్కడి ప్రకృతి అందాలను, ప్రజల జీవన విధానాలను తెలుసుకునే వ్యక్తి.. ఈ మధ్యే శ్రీలంకలో పర్యటించిన ఆమె.. అక్కడి నుంచి భారత్‌కు వచ్చారు.. చెన్నై నుంచి రోడ్డు మార్గంలో గోవాకు వెళ్లాలని అనుకున్నారు.. చెన్నై నుండి బెంగళూరు వెళ్తుండగా ఇండియన్ కరెన్సీ లేకపోవడంతో ఆమెను బస్సులోంచి దింపే ప్రయత్నం జరిగిందని.. అదే బస్సులో ఉన్న నిందితుడు సాయికుమార్.. ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని టికెట్ డబ్బులివ్వడంతో.. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడినట్టు వెల్లడించారు పోలీసులు.. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆమెపై కన్నేసిన అతడు.. మాయమాటలతో నమ్మించి తన గ్రామం వెంకన్నపాలెం తీసుకెళ్లి.. తన స్నేహితుడు షేక్ అబిద్ తో బాధితురాలిని సైదాపురం అడవుల్లోకి తీసుకెళ్లారని.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన ఆమె అత్యాచారయత్నానికి ఒడిగట్టారని.. వారి బారి నుంచి తప్పించుకున్న ఆమె పోలీసులను ఆశ్రయించినట్టు వెల్లడించారు.