Movie Ticket Prices: సినీ ఇండస్ట్రీపై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వివాదానికి తెరదింపుతూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం… టికెట్ల వివాదంతో పాటు మరికొన్ని సమస్యలకు కూడా పరిష్కారం చూపించింది.. దీనిపై స్పందించిన సినీ పరిశ్రమ ప్రముఖులు.. సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.. ఇక, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌కు సన్మానం చేసే ప్రయత్నాల్లో కూడా ఉన్నారు.. అయితే, సినీ ఇండస్ట్రీ పెద్దల వైఖరిని తప్పుబట్టారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్… జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్న ఆయన.. ఆవిర్భావ సభ నిర్వాహణ కమిటీలతో సమావేశం అయ్యారు.. సభకు వచ్చే వారి రవాణా, పార్కింగ్ ఏర్పాట్ల పైనే ప్రత్యేక ఫోకస్ పెట్టాలని సూచించారు.. సభకు వచ్చే మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.. ఈ సందర్భంగా.. సినిమా టిక్కెట్ల పెంపు జీవో జారీ.. సినీ ఇండస్ట్రీ వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు.. సినిమా ఇండస్ట్రీ సీఎంకు సన్మానం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందని దుయ్యబట్టిన ఆయన.. సినీ ఇండస్ట్రీ పెద్దల వైఖరి మారాలని సూచించారు.
Read Also: AP: కేసీఆర్‌కు ఏపీలో పాలాభిషేకం..
Also Read
- AP Weather Update: ఈదురు గాలులతో వర్షాలు.. ఈ జిల్లాల్లో కీలక హెచ్చరికలు జారీ..
- Tirumala Tirupati: తిరుమలలో ఎల్‌నినో ఎఫెక్ట్.. మరో 120 రోజులకు మాత్రమే నీళ్లు..
- Dussehra: శ్రీశైలం భ్రమరాంబికాదేవి క్షేత్రంలో దసరా మహోత్సవాలు.. అక్టోబర్ 11 నుంచి ప్రారంభం..
- YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
ఇక, వినోదాన్ని పేదలకు అందుబాటులోకి తెస్తానన్న ప్రభుత్వం.. ఇప్పుడు రేట్లు పెంచింది.. దీనికేం సమాధానం చెబుతారు..? అని సినీ పెద్దలను ప్రశ్నించారు నాదెండ్ల మనోహర్.. రాత్రికి రాత్రే పేదలు ధనవంతులయ్యారా..? అంటూ ప్రభుత్వాన్ని నిలదీసిన ఆయన.. ప్రజలను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం తీరును తప్పుపడుతూ ప్రజలకు సినీ ఇండస్ట్రీ అండగా నిలబడాలని సూచించారు. తమ విషయంలోనే ప్రభుత్వం ఇలా వ్యవహరించిందంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటి? అనేది సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఆలోచించాలని తెలిపారు. కాగా, ఈ మధ్యే జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.. ఈ మూవీ విడుదలై.. వారం గడిచిన తర్వాత ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా జీవో జారీ చేసిందనే ఆరోపణలు వినిపిస్తోన్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Flipkart Minutes App: Flipkart Minutes ప్రత్యేక యాప్ లాంచ్.. ఇక 10 నిమిషాల్లోనే డెలివరీ, Blinkit- Zeptoకు గట్టి పోటీ!
-
Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్
-
Khawaja Asif: ‘మధ్యవర్తి’ నుంచి ‘గారడీవాడి’ స్థాయికి.. పాకిస్థాన్‌కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
-
Samsung A07: HD+ PLS LCD డిస్‌ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
-
Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!