మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ శాసనసభాక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు నోటీసులు జారీ చేశారు ముంబై పోలీసులు.. అక్రమంగా ఫోన్‌లను ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలపై ఆదివారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని కోరుతూ ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు దేవేంద్ర ఫడ్నవీస్‌కు నోటీసులు జారీ చేశారు.. ఆదివారం ఉదయం 11 గంటలకు బీకేసీ సైబర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, ఐపీఎస్ అధికారి రష్మీ శుక్లా రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న సమయంలో అక్రమ ఫోన్ ట్యాపింగ్‌పై నమోదైన కేసులో ఫడ్నవీస్‌ను సాక్షిగా పేర్కొంటూ మహారాష్ట్ర ప్రభుత్వం గతంలో కోర్టుకు తెలిపింది విషయం తెలిసింది.
Read Also: Kollu Ravindra: వైఎస్ వివేకాను ఎవరు చంపారో క్లారిటీ వచ్చింది..
ఇక, ముంబై పోలీసుల నోటీసులపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన దేవేంద్ర ఫడ్నవీస్.. మహారాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. బదిలీ పోస్టింగ్ స్కాంపై రాష్ట్ర ప్రభుత్వం 6 నెలలుగా ఏమీ చేయలేదన్న ఆయన.. మహరాష్ట్ర ప్రభుత్వం చర్యల్లో తప్పులను బయటపెట్టినందుకే తనకు నోటీసులు పంపారంటూ విమర్శలు గుప్పించారు.. అయితే, ఇలాంటి చర్యలకు తాను భయపడేదిలేదని స్పష్టం చేశారు.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.. కాగా, మహారాష్ట్ర హోం మంత్రిగా దిలీప్ వాల్సే పాటిల్ ఉన్న సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే, మంత్రి బచ్చు కడు, మాజీ ఎమ్మెల్యే ఆశిష్ దేశ్‌ముఖ్, మాజీ ఎంపీ సంజయ్ కకడే తదితర రాజకీయ నేతల ఫోన్‌లను ఐపీఎస్ అధికారిణి రష్మీ శుక్లా అక్రమంగా ట్యాప్ చేశారని.. గత నెలలో ఆరోపించారు. ఇక, ఫడ్నవీస్‌కు జారీ చేసిన నోటీసులో ఈ కేసుకు సంబంధించి ప్రశ్నాపత్రాలను సీల్డ్ కవర్‌లో పంపామని, అయితే అతను వాటికి సమాధానం ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా, అతని సమాధానం కోరుతూ ఇప్పటికే రెండుసార్లు నోటీసులు కూడా జారీ చేయబడ్డాయి. అయినా సమాధానం ఇవ్వలేదంటున్నారు.. దీంతో పోలీసుల ఎదుట హాజరుకావాలని ఫడ్నవీస్‌కు మూడు లేఖలు కూడా పంపారు. అయితే, సమాధానం ఇవ్వడంలో ఫడ్నవీస్ విఫలమయ్యారని విమర్శించారు.. తాజా నోటీసులో, ఆదివారం సైబర్ పోలీసుల ముందు హాజరు కావాలని కోరినట్లు పోలీసు అధికారులు తెలిపారు.