ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఓ వైపు ఉక్రెయిన్ చర్చలకు ప్రతిపాదనలు పంపుతున్నా.. రష్యా మాత్రం దాడులు చేస్తూనే ఉంది.. ఇక, రష్యాతో నాటో ప్రత్యక్ష పోరుకు దిగితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని వార్నింగ్ ఇచ్చారు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్. ఆ పరిణామాలను నివారించేందుకే ఉక్రెయిన్ విషయంలో రష్యాతో అమెరికా నేరుగా పోరాటం చేయట్లేదని వెల్లడించారు. అయితే ఉక్రెయిన్‌పై రష్యా రసాయన ఆయుధాలు వినియోగిస్తే.. భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.
Read Also: Ukraine Russia War: వణికిపోతోన్న ఉక్రెయిన్.. రష్యాకు తాజా ప్రతిపాదన
యూరప్‌లో అమెరికా మిత్రదేశాలకు తమ సహాయం ఎప్పటికీ కొనసాగుతుందన్నారు బైడెన్. నాటో దేశాల భూభాగాల్లోని ప్రతి అంగుళాన్ని పరిరక్షించుకుంటామని.. కానీ, ఉక్రెయిన్‌లో రష్యాకు వ్యతిరేకంగా తాము నేరుగా యుద్ధానికి దిగబోమని క్లారిటీ ఇచ్చారు. అయితే ఉక్రెయిన్‌లో రష్యా ఎన్నటికీ విజయం సాధించలేదన్నారు బైడెన్. ఎలాంటి పోరాటం లేకుండానే ఉక్రెయిన్‌పై ఆధిపత్యం సాధించగలమని పుతిన్ అనుకున్నారని… కానీ, ఆయన విఫలమయ్యారని చెప్పారు బైడెన్.