SS Rajamouli: సీఎం సానుకూలంగా స్పందించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తాజా మూవీ ఆర్‌ఆర్‌ఆర్.. ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఇక, ప్రభుత్వం సినిమా టికెట్ల వివాదానికి తెరదింపుతూ కొత్త జీవోను విడుదల చేసిన నేపథ్యంలో.. ఇవాళ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు దర్శకుడు రాజమళి, నిర్మాత డీవీవీ దానయ్య.. సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అనంతరం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాజమౌళి, దానయ్య.. మీడియాతో మాట్లాడారు.. సీఎం వైఎస్ జగన్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారన్నారు. ఆర్ఆర్ఆర్ భారీ బడ్జెట్ సినిమా కావున.. సినిమాకు ఏం చేయాలో అది చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.. సీఎం మాతో బాగా మాట్లాడారని.. సమస్యలపై సానుకూలంగా స్పందించారని తెలిపారు రాజమౌళి..
కాగా, ఆర్‌ఆర్‌ఆర్ మూవీ.. ఈనెల 25వ తేదీన విడుదలకాబోతోంది.. దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటించారు… ఇక, ఆలియా భట్, ఒలీవియా మోరిస్హీరోయిన్లుగా.. అజయ్‌దేవ్‌గన్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ నిర్మాత డీవీవీ దానయ్య కాగా.. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ భారీ బడ్జెట్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.. అదేస్థాయిలో ప్రీ బిజినెస్ కూడా చేస్తోంది ఆర్‌ఆర్‌ఆర్ మూవీ.
Also Read
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..