Janasena: పొత్తులపై క్లారిటీ వచ్చేసింది.. టార్గెట్ ఒక్కటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ వచ్చేసింది… గుంటూరు జిల్లా ఇప్పటంలో జరిగన జనసేన ఆవిర్భావ సభ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చేశారు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఎట్టిపరిస్థితుల్లో చీలనివ్వమంటూ స్పష్టం చేసిన ఆయన.. బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నాం.. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి.. రాష్ట్ర అభివృద్ధికోసం పార్టీలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. వైసీపీని గద్దె దింపడమే తమ లక్ష్యమని ప్రకటించిన ఆయన.. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఉంటుందనే తరహాలో చెప్పకనే క్లారిటీగా చెప్పేసినట్టు అయ్యింది.
కాగా, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మళ్లీ టీడీపీ-జనసేన దగ్గరయ్యే ప్రయత్నాలు జరిగినట్టు కొన్నిసందర్భాల్లో స్పష్టం అయ్యింది.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో కలిసి పోటీ చేయడం.. అధికారాన్ని పంచుకోవడం కూడా చేశారు.. ఈ నేపథ్యంలో.. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొనేందుకు జనసేన, టీడీపీ కలిసి పనిచేస్తాయా? లేదా ? అనే విషయంలో చర్చ సాగుతూ వస్తోంది.. ఇలాంటి తరుణంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు కొంత క్లారిటీ ఇచ్చాయనే చెప్పాలి.. అయితే, జనసేన పార్టీ నేతలు.. పవన్ కల్యాణ్ కీలకమైన ప్రకటన చేస్తారని.. రాష్ట్ర భవిష్యత్‌ను దిశా నిర్దేశం చేసే ప్రకటన ఉంటుందని చెబుతూ వచ్చారు.. దాని అనుగుణంగా పవన్ వ్యాఖ్యలు ఉన్నా.. కొంత గందరగోళ పరిస్థితి కూడా ఉందంటున్నారు విశ్లేషకులు.. వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తుందనే చెబుతూనే.. బీజేపీ రోడ్ మ్యాప్ కోసం వేచి చూస్తున్నానని చెప్పడం ఏంటి? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
తాజావార్తలు
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
-
Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!