టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు అన్న ఘట్టమనేని రమేష్ బాబు కన్నుమూశారు.. ఆయన వయస్సు 56 సంవత్సరాలు.. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురికాగా.. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలిస్తుండగా రమేష్ బాబు మృతి చెందారు.. దీంతో.. సూపర్ స్టార్ కుటుంబం విషాదంలోకి వెళ్లిపోయింది.. అయితే, రమేష్ బాబు భౌతికకాయానికి నివాళులర్పించేందుకు అభిమానులు తరలివస్తున్నారు.. ఈ నేపథ్యంలో అభిమానులకు […]
మేషం : ఈ రోజు ఈ రాశిలోని మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. భాగస్వామికంగా కంటె సొంత వ్యాపారాలే మీకు అనుకూలిస్తాయి. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆకస్మిక ఖర్చులు, ధనం సమయానికి అందకపోవటం వంటి చికాకులు ఎదుర్కుంటారు. వృషభం : ఈ రోజు ఈ రాశివారు కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. విద్యార్థులకు దూర ప్రదేశాల్లో కోరుకున్న విద్యావకాశాలు లభిస్తాయి. సంఘంలో మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. బంధువుల […]
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.. నిన్న హైదరాబాద్ బీజేపీ సభలో ప్రశంగించిన శివరాజ్ సింగ్ చౌహాన్.. సీఎం కేసీఆర్ దమమున్నోడు అనుకున్నాను.. కానీ, ఇంతభయస్తుడు అనుకోలేదని ఎద్దేవా చేసిన ఆయన.. బండి సంజయ్‌ను జైల్లో పెట్టారంటేనే కేసీఆర్ ఎంతగా భయపడ్డారో అర్ధం అవుతుందన్నారు.. కేసీఆర్ అన్యాయ పాలనకు అగ్గి పెట్టేవరకూ విడిచిపెట్టం అంటూ హెచ్చరించారు.. అయితే, అదే స్థాయిలో చౌహాన్‌పై కౌంటర్ ఎటాక్ […]
ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు మరో లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం, తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన పులి మరియ దాస్ అలియాస్ చిన్నాను అధికార వైసీపీకి చెందినవారి నుంచి, గూండాల నుంచి తీవ్ర ప్రాణహాని ఉందని డీజీపీ దృష్టికి తీసుకెళ్లిరు.. పులి మరియ దాస్ టీడీపీలో క్రియాశీలక సభ్యునిగా ఉంటూ వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. దీంతో, వైసీపీ ఎంపీ నందిగాం […]
తెలంగాణ సర్కార్, సీఎం కేసీఆర్‌పై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్‌రావు.. శివరాజ్ సింగ్ చౌహాన్ అవాకులు చెవాకులు మాట్లాడారని ఫైర్ అయిన ఆయన.. వంద ఎలుకలను తిన్న పిల్లి తాను శాఖాహారి అన్నట్లు ఉంది ఆయన వ్యవహారమని మండిపడ్డారు.. టీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్ ను విమర్శించే నైతిక హక్కు మీకు లేదు.. దొడ్డి దారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కుని సీఎం అయ్యావు అంటూ మండిపడ్డారు.. ఇక, నాలుగేళ్లు […]
తెలంగాణలో పాల్వంచ ఆత్మహత్య కేసు సంచలనం సృష్టించింది… బాధితుడు రామకృష్ణ ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియోతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవను అరెస్ట్ చేశారు పోలీసులు.. ఆ వీడియోలో రామకృష్ణ బయటపెట్టిన అంశాలు కలకలం సృష్టించగా.. తాజాగా, మరో వీడియో తాజాగా బయటకు వచ్చింది. భార్య, పిల్లలతో సహా తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం వనమా రాఘవతే కారణమని ఆ వీడియోలోనూ స్పష్టం చేసిన రామకృస్ణ.. రాఘవతో పాటు […]
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం అవుతోంది… ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది.. మధ్యాహ్నం 3.30 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సంబంధించిన ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసినట్టు మీడియాకు సమాచారం ఇచ్చింది సీఈసీ.. ప్రస్తుత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ పదవీకాలం మే నెలలో ముగియనుండగా.. మిగతా నాలుగు అసెంబ్లీల గడువు మార్చిలోనే వేర్వేరు […]
ఇప్పుడు ఎన్నికలు ఏమీ లేవు.. అయినా ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.. కుప్పం పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన లవ్ కామెంట్లపై పెద్ద రచ్చ జరుగుతోంది.. జనసేన పార్టీని ఉద్దేశించి చంద్రబాబు ఆ కామెంట్లు చేయగా.. బీజేపీ, వైసీపీ ఈ వ్యవహారంపై మండిపడుతోంది.. జనసేన పార్టీ తమకు మిత్రపక్షమని బీజేపీ అంటుంటే.. పొత్తులు లేకుండా చంద్రబాబు ఒక్కసారైనా గెలిచారా? అని వైసీపీ ప్రశ్నిస్తోంది.. ఇక, ఈ వ్యవహారంపై ప్రకాశం జిల్లా పర్యటనలో […]
కీలక సమావేశాన్ని వాయిదా వేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఈ నెల 9వ తేదీన మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జనసేన కార్యనిర్వాహక సమావేశం జరగాల్సి ఉంది.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరగాల్సిన ఈ సమావేశంలో.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్ని రాజకీయ పరిస్థితులు, రైతుల సమస్యలు, ఇతర అంశాలతో పాటు వివిధ వర్గాలు ఎదుర్కొంటన్న సమస్యలపై చర్చించాలనుకున్నారు. Read Also: జగ్గారెడ్డి దీక్ష రద్దు మరోవైపు.. పార్టీ […]
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి దీక్ష తలపెట్టిన సంగతి తెలిసిందే.. తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగారెడ్డి నియోజకవర్గం, జిల్లాలోని గ్రామపంచాయతీ పరిధిలోని ఇల్లీగల్ లేఔట్స్, ఇళ్ల నిర్మాణాలను ఎల్ఆర్ఎస్ మరియు బీఆర్ఎస్ ద్వారా క్రమబద్దీకరణ చేయాలన్న డిమాండ్‌తో దీక్షకు ప్లాన్ చేశారు.. అయితే, పోలీసులు జగ్గారెడ్డి నిరసన దీక్షకు అనుమతి ఇవ్వలేదు.. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 10వ తేదీ వరకు ఎలాంటి పబ్లిక్ మీటింగ్స్, సమావేశాలు నిర్వహించడానికి లేదంటూ […]