Astrology: మార్చి 21, సోమవారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు ఈ రాశివారు లక్ష్య సాధనలో ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారస్తులు దస్త్రం వ్యవహారంలో క్షణం తీరిక ఉండదు. అధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. విద్యార్థులకు అతి ఉత్సాహం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి.
వృషభం : ఈ రోజు ఈ రాశిలోని రాజకీయనాయకులకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల భంగపాటుకు గురవుతారు. అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. విద్యార్థుల్లో మానసిక ధైర్యం నెలకొంటుంది.
Also Read
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు.. మరి ఏం చేయాలి?
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
- Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే!
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
మిథునం : ఈ రోజు ఈ రాశిలోని వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళుకువ అవసరం. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశిలోని రాజకీయాలలోని వారికి ప్రయాణాలలో మెళుకువ అవసరం. మీ స్థోమతకు మించి వాగ్ధానాల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీల ఆరోగ్యములో మెళుకువ అవసరం. సోదరీ సోదరుల మధ్య ఆస్తి పంపకాల ప్రస్తావన వస్తుంది. తెలివి తేటలతో వ్యవహారించడంవల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి.
సింహం : ఈ రోజు ఈ రాశిలోని కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకం. ఉద్యోగస్తులు పై అధికారులతో సంభాషించునపుడు జాగ్రత్త వహించండి. ఏ పని మొదలు పెట్టినా మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయండి. దంపతుల మధ్య అరమరికలు లేకుండా మెలగవలసి ఉంటుంది. మీ సేవలకు మంచి గుర్తింపు లభిస్తుంది.
కన్య : ఈ రోజు ఈ రాశివారు ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు చోటుచేసుకున్నా నెమ్మదిగా సమసిపోతాయి. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు లాభసాటిగా ఉంటాయి.
తుల : ఈ రోజు ఈ రాశిలోని ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. దంపతుల మధ్య విభేదాలు తొలగిపోయి ఉల్లాసంగా గడుపుతాయి.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశివారు తమ సంతానానికి కోరుకున్న విద్యావకాశాలు లభిస్తాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉమ్మడి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. స్త్రీలకు ప్రయాణాలు అనుకూలిస్తాయి. ధన వ్యయం అధికమైనా సార్థకత ఉంటుంది. ఉద్యోగస్తుల తొందరపాటు తనం వల్ల అధికారులతో మాటపడక తప్పదు.
ధనస్సు : ఈ రోజు ఈ రాశివారు రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హజరుకావడం మంచిది. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల జాగ్రత్త అవసరం.
మకరం : ఈరోజు ఈ రాశివారికి బ్యాంకింగ్, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. స్త్రీలకు పనివారలతో చికాకులు అధికమవుతాయి. రుణ దాతలను మంచి మాటలతో సంతృప్తి పరచడం శ్రేయస్కరం. బంధువులతో తెగిపోయిన సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం.
కుంభం : ఈ రోజు ఈ రాశిలోని స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. కీలకమైన విషయాలు మీరే సమీక్షించుకోవటం మంచిది. నేడు ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి, ఇతరుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది.
మీనం : ఈ రోజు ఈ రాశిలోని ప్రైవేటు సంస్థల వారికి, రిప్రజెంటేటివ్‌లకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు మీ ఉన్నతికి నాంది పలుకుతాయి. ఇతరులకు వాహనం ఇవ్వటం వల్ల సమస్యలు తలత్తుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. బంధువులను కలుసుకుంటారు నేడు ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి.
తాజావార్తలు
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..