జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ఆవిర్భావ సభా వేదికగా చేసిన వ్యాఖ్యలపై ఇతర పార్టీల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి.. అధికార, ప్రతిపక్ష నేతలు ఇలా అంతా పవన్‌ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.. ఇక, ఇవాళ పవన్ వ్యాఖ్యలపై స్పందించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. పవన్ కళ్యాణ్ ఎటూకాకుండా తలతిక్కతనంగా మాట్లాడారని ఎద్దేవా చేశారు.. బీజేపీ, వైసీపీ భార్య భర్తలు పెళ్లి చేసుకోకుండా ఎలా కాపురం చేస్తారో ఆ విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డ ఆయన.. బీజేపీ, వైసీపీ, జనసేన కలిసి ఉన్నా మాకు అభ్యంతరం లేదు.. కానీ, పవన్ తలతిక్కతనంగా మాట్లాడారు.. ఆయన కన్ఫ్యూషన్‌తో మాట్లాడి వారి క్యాడర్‌ను కూడా అయోమయంలోకి నెడుతున్నారని విమర్శించారు. యువత శక్తిని నిర్వీర్యం చేయొద్దు అని సూచించిన ఆయన.. కానీ, పవన్ కళ్యాణ్ అంటే మాకు వ్యతిరేకత లేదు.. మీ విధానాలు, మీ నిలకడలేని తనానికే మేం వ్యతిరేకత తెలియజేస్తున్నాం అన్నారు.
Read Also: KCR Emergency Meeting: మంత్రులకు కేసీఆర్ పిలుపు.. ఫామ్‌హౌస్‌లో అత్యవసర భేటీ..
మరోవైపు, ఏపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు నారాయణ.. ఇప్పటివరకూ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు దందాలతో బీజీగా ఉన్నారన్న ఆయన.. కనీసం, ఇప్పటికైనా సీఎం జగన్ వారి పద్ధతిని మార్చుకోమని చెప్పడం స్వాగతిస్తున్నాం అన్నారు.. జగన్ కేబినెట్‌లో వింత జంతవులాంటి వారున్నారని ఎద్దేవా చేశారు.. జగన్ సొంత లిక్కర్‌ని తయారు చేసి ప్రమోట్ చేసుకునే పద్ధతిని తీసుకొచ్చారని విమర్శించారు.. కల్తీ మద్యంతో మరణించిన వారంతా జగన్ కిరాతకానికే బలయ్యారని ఆరోపించారు.. ఇవన్నీ మరణాలను సర్కార్ హత్యలుగానే భావించాలన్నారు నారయణ. మరోవైపు.. పెగాసెస్‌లో కేంద్ర ప్రభుత్వమే ప్రధాన ముద్దాయిగా పేర్కొన్నారు.. దీనిపై సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తోందని.. పూర్తి వివరాలు ఇవ్వమని న్యాయస్థానం కోరిందని.. ఇప్పటి వరకూ ఇవ్వలేదని.. అసలు ముద్దాయిని నరేంద్ర మోడీని వదిలిపెట్టి మీరు కొట్లాడుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.