ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు బహిరంగ లేఖ రాశారు తెలుగు మహిళా అధ్యక్షురాలు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత… వైసీపీ నేతలు కాలకేయుల మాదిరి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని పేర్కొన్న ఆమె… మచిలీపట్నం వీవోఏ నాగలక్ష్మిది ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. వైసీపీ నేత గరికపాటి నరసింహారావు వేధింపులపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లిన ఆమె.. ఈ మూడేళ్లలో మహిళలపై 1500కు పైగా అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగితే ఏం చర్యలు తీసుకున్నారు? అంటూ నిలదీశారు.. దిశా కింద ఒక్క నేరస్థుడికైనా శిక్ష విధించారా? అంటూ సూటిగా ప్రశ్నించిన అనిత.. ఆడబిడ్డలపై వరుస అఘాయిత్యాలకు ప్రభుత్వ బాధ్యతారాహిత్యమే కారణం అని విమర్శించారు.. ఆడబిడ్డలు అన్యాయమైపోతుంటే వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తున్నారు? అంటూ మండిపడ్డ ఆమె… మహిళా హోంమంత్రి ఉండీ మహిళలకు రక్షణ లేకపోవడం బాధాకరం అంటూ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Peddireddy: గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం.. సీఎం జగన్ తెచ్చారు..!