మహిళలపై వరుసగా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.. రోజూ ఏదో ఒక చోటు ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. ఇక, తమిళనాడులో ఓ వైద్యురాలిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన కలకలం రేపుతోంది.. తనతో ఉన్న స్నేహితుడిపై దాడి చేసి బెదిరించిన ఆటో డ్రైవర్లు.. ఆ తర్వాత యువ డాక్టర్‌పై అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటన సంచలనంగా మారింది.. వేలూరు సత్‌వచ్చారిలో జరిగిన ఈ ఘటన విస్మయానికి గురిచేస్తోంది.
Read Also: COVID 19: ఆ వేరియంట్‌తో మళ్లీ ముప్పు.. అమెరికా వార్నింగ్..
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వేలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఓ యువతి డాక్టర్‌గా పనిచేస్తోంది.. మూడు రోజుల క్రితం తన స్నేహితులతో కలిసి కాట్పాడిలోని సినిమా థియేటర్‌లో సెకెండ్‌షో సినిమా చూసేందుకు వెళ్లింది.. ఇక, సినిమా అనంతరం స్నేహితులతో కలిసి వేలూరుకు షేర్ ఆటోలో బయలు దేరింది వైద్యురాలు.. ఆటోను సత్‌వచ్చారిలోని మరో రోడ్డుకు మళ్లించారు ఆటోలోని నలుగురు యువకులు.. యువతి డ్రైవర్‌ను నిలదీయగా సమాధానం ఇవ్వకుండా ఆటోను పాలారు నది ఒడ్డుకు తీసుకెళ్లారు.. యువతి స్నేహితునిపై దాడి చేసి బెదిరించి అక్కడి నుంచి మరిమేశారు.. అనంతరం నలుగురు యువకులు.. ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.. ఈ ఘటన సత్‌వచ్చారి పోలీసులకు చేరింది.. దీంతో.. కేసు నమోదు చేసి పరిరీలో ఉన్న నలుగురి కోసం వేట ప్రారంభించిన పోలీసులు.. ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.