Bandi Sanjay: ఇక రజాకార్ ఫైల్స్.. ఓల్డ్ సిటీ ఫైల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. “ది కాశ్మీర్ ఫైల్స్” కు వ్యతిరేకంగా మాట్లాడే ముఖ్యమంత్రికి డీఎన్ఏ టెస్ట్ చేయాలని వ్యాఖ్యానించారు.. పాకిస్థాన్, చైనాలకు అనుకూలంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని విమర్శించిన ఆయన.. త్వరలో “పాతబస్తీ ఫైల్స్”, “అవినీతి ఫైల్స్” బయటకు వస్తాయన్నారు.. అయినా, నీకు కాశ్మీర్ ఫైల్స్ ఎందుకు నచ్చుతాయి.. దోపిడీ దొంగలు లాంటి సినిమాలు నచ్చుతాయన్నారు. తెలంగాణలో కేసీఆర్ రజాకార్ల పాలన నడిపిస్తున్నారని ఆరోపించిన సంజయ్.. బోధన్‌లో బీజేపీ కార్యకర్తలు, హిందువులపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Jagga Reddy: రేవంత్‌రెడ్డి ఇచ్చుడు కాదు.. నేనే ఝలక్ ఇస్తా..
Also Read
కేసీఆర్ ఎంతమంది రాజకీయ వ్యూహకర్తలు వచ్చినా బీజేపీ ఏం చేయలేరన్నారు బండి సంజయ్.. అవినీతి యూపీఏ పాలనలో కేంద్ర మంత్రిగా కేసీఆర్ భాగస్వామి అని విమర్‌శించిన ఆయన.. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. భారత ప్రభుత్వాన్ని, విదేశాంగ విధానాన్ని ప్రశంసిస్తుంటే… కేసీఆర్ మాత్రం విమర్శలు చేస్తున్నారన్నారు.. ఇమ్రాన్ కు ఉన్న బుద్ధి, కేసీఆర్ కు లేదని ఫైర్ అయిన ఆయన.. ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులను స్వదేశానికి రప్పించిన ఘనత కేంద్రానిది అయితే… కేసీఆర్ తన ఘనతగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఒక మోసకారి, నిత్యం రాజకీయాలతో కాలం గడుపుతున్నారని మండిపడ్డారు.
తాజావార్తలు
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
-
Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!