సూపర్ సిక్స్-సూపర్ హిట్ పేరుతో విజయోత్సవ సభను ఈనెల 10న అనంతపురంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.. భారీ ఎత్తున ఈ సభ జరగనున్న నేపథ్యంలో పోలీసులు కీలక సూచనలు చేశారు.. ఈనెల 10వ తేదీన అనంతపురంలో జరిగే సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభ నేపథ్యంలో ఆ ఒక్కరోజు వాహనదారులు ఈకింది ఆంక్షలు పాటించి పోలీసులతో సహకరించాలని కోరారు జిల్లా ఎస్పీ పి.జగదీష్..
కేంద్రమంత్రి జేపీ నడ్డాకు ఫోన్ చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో యూరియా సరఫరాపై సమీక్ష నిర్వహించిన సీఎం.. సమావేశం మధ్యలోనే జేపీ నడ్డాకు ఫోన చేశారు.. కాకినాడ తీరానికి వచ్చే నౌకలో 7 వేగన్లు.. ఏపీకి కేటాయించాలని కోరారు.. దీనిపై సానుకూలంగా స్పందించారట నడ్డా.. ఇక, దీంతో, రాష్ట్రానికి 17,293 మెట్రిక్ టన్నుల యూరియాను కాకినాడ పోర్టులో దిగుమతికి జీవో జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం..
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్రలో కొత్త రికార్డు సృష్టించారు మరోసారి టీటీడీ ఈవోగా నియమితులైన అనిల్ కుమార్ సింఘాల్.. టీటీడీ ఈవోగా రోండోవసారి నియమితులైన మొదటి అధికారిగా అనిల్ కుమార్ సింఘాల్ రికార్డుకెక్కారు..
యూరియా సరఫరా, ఉల్లి కొనుగోళ్లు, తురకపాలెం గ్రామంలో ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఆర్జీజీఎస్ నుంచి ఆయా అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు..
ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ, వైసీపీ, జనసేన, బీఆర్ఎస్ ఎంపీలు.. తెలుగు వ్యక్తి, యూపీఏ అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పలు దఫాలుగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరుగుతూ వచ్చాయి.. అయితే, ఈ సారి రాష్ట్రంలోని 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి ఏసీబీ కోర్టును ఆశ్రయించారు.. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి.. విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు రాజ్ కేసిరెడ్డి..
చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని రేపు 12 గంటల పాటు మూసివేయనుంది టీటీడీ. ఆలయంలో 15 గంటల పాటు దర్శనాలు నిలిచిపోనుంది. మరోవైపు అన్న ప్రసాద సముదాయాన్ని కూడా రేపు మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి ఎల్లుండి ఉదయం 8:30 గంటల వరకు మూసి వేయనుంది టీటీడీ. రేపు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలతో పాటు పౌర్ణమి గరుడసేవను రద్దు చెయ్యగా.. ఎల్లుండి సిఫార్సు లేఖలపై జారీ చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ.
మరో ఆందోళనకు సిద్ధమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఈనెల 9వ తేదీన వైసీపీ 'అన్నదాత పోరు' పేరుతో కార్యక్రమాలు నిర్వహించనుంది.. యూరియా కొరత, రైతాంగ సమస్యలపై నిరసనలకు పిలుపునిచ్చింది.. ఆర్డీవో కార్యాలయాల ఎదుట వైసీపీ శాంతియుత నిరసనలు తెలపనుంది.. 'అన్నదాత పోరు' పోస్టర్ని పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు.