SVSN Varma: టీడీపీ సీనియర్ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మపై మంత్రి నారాయాణ టెలీకాన్ఫరెన్స్‌లో చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో కాకరేపాయి.. అయితే, ఇదంతా వైసీపీ సృష్టించిందేనని కొట్టిపారేశారు మంత్రి నారాయణ.. విశాఖ పర్యటనలో ఉన్న మంత్రి నారాయణను వర్మ కలవడం.. వర్మను జీరో చేశామనే వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వడం జరిగిపోయాయి.. టెలీ కాన్ఫరెన్స్ లో నేను మాట్లాడిన మాటలను కట్ పేస్ట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని మండిపడ్డారు నారాయణ.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడని వర్మ.. మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగమంటే ఆగుతాను.. దూకమంటే దూకుతాను అని స్పష్టం చేశారు..
Read Also: Fraud: పేరుకు డాక్టర్లు చేసేది మోసాలు.. చిట్టీల పేరుతో రూ. 150 కోట్లు స్వాహా..
మంత్రి నారాయణ వ్యాఖ్యలపై అభూత కల్పనలు ప్రచారం చేశారన్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ.. పేటీఎం బ్యాచ్ చేసే అసత్య ప్రచారాలను నేను పట్టించుకోను అని స్పష్టం చేశారు.. తెలుగుదేశం పార్టీలో నేను పిల్లర్ లాంటి వాడిని అన్నారు. ఇక, మంత్రి నారాయణ జనసేన, టీడీపీ మధ్య కాకినాడ జిల్లాలో వారధిగా పనిచేస్తున్నారని వెల్లడించారు.. కూటమి మధ్య విబేధాలు సృష్టించడం ఎవరి వల్ల కాదు అని స్పష్టం చేశారు టీడీపీ సీనియర్ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ.. ఇక, కింది వీడియో లింక్‌ను క్లిక్ చేసి.. మంత్రి నారాయణ, మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవచ్చు..