Off The Record : మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ కి తెరపడినట్టేనా..?
- పీసీసీ అధ్యక్షుడు, ఇన్ఛార్జ్ మాట్లాడాక మొత్తం సెట్ అయినట్టేనా?..
- కొండా కుమార్తె సుస్మిత మాటలతోనే రచ్చ పెరిగిందా?..
- బీసీ వర్సెస్ రెడ్డిగా టర్న్ అవుతోందన్న భయం..
- పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించారన్న అభిప్రాయం..
- బీసీ మంత్రి మీద కక్షగట్టారన్న వాదన తెరపైకి..
- పోలీసుల అత్యుత్సాహం, సుస్మిత వ్యాఖ్యల్ని కూడా తప్పు పట్టిన పెద్దలు..
- రెండు గంటల భేటీలో సురేఖ అన్ని విషయాలు చెప్పేశారా?..
- పోలీస్ అధికారుల మీద చర్యల ప్రతిపాదన?..
- టీ కప్పులో తుఫానా? తుఫాన్ ముందు ప్రశాంతతా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record : కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ టీ కప్పులో తుఫాన్‌లా ముగిసిపోయినట్టేనంటున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిలిచి మాట్లాడాక ఎపిసోడ్ మొత్తం సెట్ అయినట్టు చెప్పుకుంటున్నారు. ఆ విషయంలో సురేఖ… మురళి చేసిన లొల్లి కంటే….. వాళ్ళ కూతురు సుస్మిత చేసిన గొడవే పెద్ద రచ్చకు దారి తీసింది. పైగా ఇది బీసీ వర్సెస్ రెడ్లు టర్న్ అవుతోందన్న సంకేతాలు రావడం, ఓవైపు పార్టీ బీసీ నినాదం, మరోవైపు స్థానిక ఎన్నికల టైంలో వివాదాన్ని ఇంతకు మించి పెరగనీయకూడదని భావించారట పార్టీ పెద్దలు. అందుకే ఆఘమేఘాల మీద సెటిల్ చేసినట్టు తెలుస్తోంది. మంత్రి కొండా ఇంటికి పోలీసులు వెళ్ళడాన్ని పార్టీలోని సీనియర్స్, కీలక నేతలు కొందరు కూడా తప్పు పట్టారట. మంత్రి సురేఖ ఓఎస్‌డీ సుమంత్ ఎపిసోడ్ పై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారన్నది పార్టీలోని మెజారిటీ నాయకుల అభిప్రాయంగా తెలుస్తోంది. అదే సమయంలో మంత్రి కూడా పోలీసులకు నచ్చజెప్పి పంపి ఉంటే… ఆమె స్థాయికి కూడా హుందాగా ఉండేదన్న అభిప్రాయం కూడా లేకపోలేదు.
ఈ వివాద క్రమంలోనే… బీసీ మంత్రి మీద కక్ష కట్టారనే వాదనను తెరమీదకు తెచ్చింది కొండా ఫ్యామిలీ. ఐతే.. దానికి అనుబంధంగా ఇంకొందరు మరో ప్రశ్న వేస్తున్నారు. బీసీ మంత్రి దగ్గర ఓసీ ఓఎస్డీని ఎందుకు పెట్టుకున్నారన్నది అలా ప్రశ్నించే వాళ్ళ వాదన. ఇలా ఈ ఎపిసోడ్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మంత్రి సురేఖ వ్యవహారశైలికంటే… కూతురు సుస్మిత మాట్లాడిన మాటలే పెద్ద రచ్చకు దారి తీశాయట. పోలీసులు అత్యుత్సాహం చూపడం ఎంత తప్పో… సుస్మిత ప్రభుత్వం మీద, సీఎం రేవంత్ మీద చేసిన వ్యాఖ్యలు కూడా అంతే తప్పు అన్న అభిప్రాయాలు బలంగా ఉన్నాయి పార్టీ వర్గాల్లో. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ భేటీలో కూడా ఇదే అంశం చర్చకు వచ్చినట్టు సమాచారం. కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్ళడాన్ని ఇన్ఛార్జ్ తప్పు పడుతూనే… సుస్మిత ఎపిసోడ్‌ను సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది.
Also Read
పార్టీకి, ప్రభుత్వానికి నష్టం చేసేలా మాట్లాడటం ఏంటి..? ఏదన్నాఇష్యూ ఉంటే మా దృష్టికి తేవచ్చుకదా అని నేరుగా అడిగినట్టు సమాచారం. రెండు గంటల పాటు జరిగిన భేటీలో… ఇంచార్జ్ మీనాక్షి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ల ముందు తనకు జరిగిన అవమానాలు గురించి… జిల్లాలో జరుగుతున్న కుట్రల గురించి మంత్రి ప్రస్తావించినట్టు సమాచారం. దాంతో… ఇవన్నీ పార్టీలో అంతర్గతంగా మాట్లాడి పరిష్కరించుకోవాలి కానీ… రచ్చకెక్కడం మంచిది కాదని నచ్చచెప్పినట్టు తెలిసింది. అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలన్న ప్రతిపాదన కూడా పార్టీ నుండి వెళ్లినట్టు సమాచారం. సాఫీగా సాగుతున్న పరిస్థితిలో వివాదాల్లోకి ఎందుకు వెళ్ళడం అనే తరహాలో పార్టీ నాయకత్వం ఉంది. మొత్తానికి.. కొండా సురేఖ ఉప ముఖ్యమంత్రి భట్టితో భేటీ, మీనాక్షి , మహేష్‌లతో మంతనాల తర్వాత ఈ వివాదానికి తెర పడినట్టేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది పార్టీ సర్కిల్స్‌లో. అదే టైంలో… మూడు నాలుగు రోజులుగా జరుగుతున్న ఎపిసోడ్ టీ కప్పులో తుఫాన్ లా చల్లారినట్టేనా..? లేదంటే ఇది తుఫాన్ ముందు ప్రశ్నంతతా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్‌లో డిస్‌ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో TWS ఇయర్‌బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!