AP Crime: తమ పేరుపై ఉండాల్సిన భూమి.. తమ ప్రమేయం లేకుండానే మరో వ్యక్తి పేరు మీదకు మారిపోవడంతో.. బాధితుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది.. బీఎన్ కండ్రిగ ఎమ్మార్వో ఆఫీసులో పల్లమాలకు చెందిన పాండు అనే వ్యక్తి ఎంఆర్వో సమక్షంలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. తమ ఐదెకరాల భూమిపై గొడవలు జరుగుతున్నాయని, ప్రస్తుతం దీనిపై కోర్టులో కేసులు నడుస్తున్నాయన్నారు. అయితే, ఈ నెల 8వ తేదీ వరకు తన తల్లి వదప్పగారి అనసూయమ్మ పేరు మీద ఉన్న భూమి.. ఇప్పుడు బి.రవీంద్రబాబు పేరు మీదకు ఎలా మారిందంటూ ప్రశ్నించారు. ఆ సమయంలో ఎమ్మార్వో అక్కడే ఉండడంతో ఆయన సమక్షంలోనే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.. వెంటనే స్థానికులు అడ్డుకున్నారు.. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణ్యం అన్నాడు.. అయితే, అధికారులు ఈ విషయంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి న్యాయం చేస్తామన్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా బీఎన్ కండ్రిగ ఎమ్మార్వో కార్యాలయం దగ్గర తీవ్ర కలకలం రేగింది..
Read Also: Etela Rajender: ఇది అబద్ధమైతే నేను రాజకీయల నుంచి తప్పుకుంటా.. ఈటల సంచలన వ్యాఖ్యలు..