కోవిడ్ పేరు చెబితేనే ప్రపంచదేశాలు ఇప్పటికీ వణికిపోతున్నాయి.. ఎక్కడైనా వింత వ్యాధి వెలుగుచూసిందంటే.. దాని వెనుక కోవిడ్ మూలాలు ఉన్నాయా? అనే అనుమానంతో చూడాల్సిన రిస్థితి.. ఇప్పటికే ఆల్ఫా, బీటా, ఒమిక్రాన్ ఇలా.. కొత్త వేరియంట్లుగా ప్రజలపై దాడి చేస్తూనే వస్తోంది హమ్మారి.. మరి, కోవిడ్‌కు అంతం ఎప్పుడు? దాని బారినుంచి బయటపడేది ఎన్నడు? అనే సందేహాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కరోనా ముగింపు దశపై ఓ ప్రకటన చేసింది. […]
వైసీపీ నేతలు ప్రత్యేక హోదా వచ్చేసినట్టు నిన్న సాయంత్రం వరకు గొప్పలు చెప్పారు.. సాయంత్రానికి కేంద్రం మాట మారిస్తే.. అది చంద్రబాబు వలనే అంటూ ప్రచారం చేశారని మండిపడ్డారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్.. అనంతపురంలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. అంటే మీరు అంత బలహీనంగా ఉన్నారా..? లేక చంద్రబాబు కేంద్రాన్ని శాసించే స్థాయిలో ఉన్నారా? అని ప్రశ్నించారు.. ముందు హోదా అంశం లిస్ట్‌లో ఉందో లేదో తేల్చండి అని […]
రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.. ఈ వ్యవహారంపై ఓ రేంజ్లో ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్‌రెడ్డి.. అస్సాం ముఖ్యమంత్రి డీఎన్ఏ ఎంటి అని అడుగుతామన్న ఆయన… అస్సాం పక్కనే చైనా ఉంది కదా.. అసలు ఆయన డీఎన్ఏ చైనాదా? అస్సాందా? అనేది తేలాలన్నారు. ఇక, మాతృత్వాన్ని అవమానించే మాటలు మాట్లాడారంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై ఆగ్రహం వ్యక్తంచేశారు రేవంత్‌రెడ్డి.. భారత్ మాతాకు పుట్టినోల్లా… […]
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై చర్చించేందుకు తేదీ, సమయం నిర్ణయించిన కేంద్రం.. మొదట అనుకున్న అజెండాలో మార్పులు చేసిన విషయం తెలిసిందే.. త్రిసభ్య కమిటీ ఎజెండాలో ఏపీకి ప్రత్యేక హోదా, రెవిన్యూ లోటు లేకుండా కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర హోంశాఖ.. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి (కేంద్ర, రాష్ట్ర వ్యవహరాలు) నేతృత్వంలో “వివాద పరిష్కార సబ్ కమిటీ” ఏర్పాటు అయిన విషయం తెలిసిందే.. అయితే, ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు […]
ఓ వైపు కరోనా విజృంభిస్తోంది.. కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉంది.. కానీ, ఇదే సమయంలో ఓ పార్టీ జరిగింది.. అది కూడా ప్రధాని నివాసం ఉన్న వీధిలోనే.. ఇదే ఇప్పుడు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను చిక్కుల్లో పడేసింది… ఆయన నివాసం ఉండే డౌనింగ్ స్ట్రీట్‌లో జరిగిన ఓ పార్టీ వ్యవహారంలో పోలీసులు ఆయనకు పలు ప్రశ్నలతో కూడిన లేఖను రాశారు.. వాటికి సమాధానం ఇచ్చేందుకు వారం రోజుల డెడ్‌లైన్ పెట్టారు.. ఈ […]
విశాఖ ఉక్కు ఉద్యమం మరింత ఉధృతం అవుతోంది… కూర్మన్నపాలెం మెయిన్ గేటు వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైల్ భరో నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి పీపుల్స్‌స్టార్ ఆర్ నారాయణ మూర్తి మద్దతు ప్రకటించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమం చేపట్టి ఏడాది అవుతున్న కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.. కార్మికుల ఉద్యమం పట్టించుకోదా..? ఏ ముఖం పెట్టుకొని విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నారాయణమూర్తి.. ఏ రాష్ట్రం, ఏ […]
చదువుకోవాల్సిన విద్యార్థులు రోడ్లు ఎక్కుతున్నారు.. రచ్చ చేస్తున్నారు.. పాఠాలు చదివే వయస్సులో మత విధ్వేషాల్లో సమిధలు అవుతున్నారు.. ఇప్పుడు హిజాబ్ వివాదం కర్నాటకలో ప్రారంభమై దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం ఈ అంశాన్ని పెద్దది చేయకండి అంటూ వ్యాఖ్యానించింది. అయితే, ఇదే సమయంలో.. అసెంబ్లీ ఎన్నికల వేళ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాఖండ్‌లో మేం మళ్లీ […]
భారత్ కరోనా కేసులు భారీ సంఖ్యలో తగ్గుతూ వస్తున్నాయి.. 50వేల దిగువకు పడిపోయాయి రోజువారి కేసులు.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 44,877 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, మరో 684 మంది కోవిడ్ బాధితులు కన్నుమూశారు… ఇక, యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 6 లక్షల దిగువకు పడిపోయి 5,37,045కు చేరింది.. రోజువారీ పాజిటివిటీ రేటు 3.48 శాతం నుంచి 3.17 శాతానికి పడిపోయినట్టు […]
ఐదుగురు ఐక్యరాజ్యసమితికి చెందిని సిబ్బందిని కిడ్నాప్‌కు గురయ్యారు.. శుక్రవారం దక్షిణ యెమెన్‌లో ఐదుగురు సిబ్బందిని కిడ్నాప్ చేశారని తెలిపారు యూఎస్ అధికార ప్రతినిధి రస్సెల్ గీకీ.. ఓ మిషన్‌లో భాగంగా ఐక్యరాజ్యసమితి సిబ్బంది దక్షిణ యెమెన్‌లో పనిచేస్తున్నారని… ఈ క్రమంలో పనిముగించుకుని అడెన్‌కు తిరిగి వస్తుండగా దుండగులు వారిని కిడ్నాప్ చేశారని తెలిపారు.. వారిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులతో మాట్లాడుతున్నామని యెమెన్‌లో ఐరాసా అధికారి రస్సెల్ గీకీ పేర్కొన్నారు.. కాగా, సౌదీ నేతృత్వంలోని మిలటరీ […]
తమ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న ఓ వ్యక్తి.. బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారు.. దాని కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా కలిశారు.. దీంతో.. పార్టీ అతనపై వేటు వేయగా.. సొంత నియోజకవర్గంలో నిరసన సెగలు తగిలాయి.. దీంతో.. కొంత కాలం సైలెంట్‌గా ఉన్న ఆ నేత.. ఇప్పుడు మళ్లీ సొంత గూటికి చేరారు.. అయితే.. థౌజండ్ లైట్స్ మాజీ ఎమ్మెల్యే సెల్వం.. గతంలో డీఎంకే ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఆయన.. 2020 ఆగస్టు 4వ […]