తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఖమ్మం బీజేపీ నేత సాయి గణేష్ ఆత్మహత్య వ్యవహారం హైకోర్టుకు చేరింది… పోలీసుల వేధింపులు తాళలేకే సాయి గణేష్ ఆత్మహత్య చేస్తున్నాడంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. ఈ ఆత్మహత్యపై సీబీఐతో విచారణ జరిపించాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు పిటిషనర్ తరపు న్యాయవాది అభినవ్.. ఇక, ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పువ్వాడ అజయ్‌తో పాటు మొత్తం 8 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.. ఇక, ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది…
Read Also: Byreddy Siddharth Reddy: నారా లోకేష్‌తో భేటీపై స్పందించిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
అయితే, సాయి గణేష్ ఆత్మహత్య పై కేసు నమోదు చేశామని.. దర్యాప్తు సాగుతోందని హైకోర్టుకు తెలిపారు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్.. అన్ని కోణాల్లో విచారణ జరుగుతోందన్నారు.. కొంత సమయం ఇస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు.. ఇక, ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. మంత్రి పువ్వాడతో పాటు మొత్తం 8 మందికి నోటీసులు జారీ చేయడంతో పాటు.. కౌంటర్ దాఖలు ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తూ.. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఆత్మహత్యాయత్నం చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన సాయి గణేష్.. పోలీసుల వేధింపులు, మంత్రి పువ్వాడ వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలిపిన విషయం తెలిసిందే.. ఇక, అతడి పరిస్థితి విషమించడంతో.. ఖమ్మం నుంచి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ .. సాయి గణేష్ మృతిచెందాడు.. ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతోంది.