సర్జికల్ స్ట్రయిక్స్‌కు సాక్ష్యమేదీ? అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించడంపై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు బీజేపీ నేతలు.. తెలంగాణ బీజేపీ నేతలతో పాటు.. ఇతర రాష్ట్రాల వారు కూడా కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్నారు.. ఈ వ్యవహారంపై స్పందించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ… డియర్ కేసీఆర్, ఇదిగో మన వీర సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్ వీడియోగ్రాఫిక్ సాక్ష్యం అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు.. అయినప్పటికీ మీరు సాయుధ బలగాల […]
కోకో పంట కాసులు కురిపిస్తోంది.. అంతర్జాతీయంగా మంచి గిరాకీ ఉన్న పంట కూడా ఇది.. చాక్లెట్లు, కాఫీ, కేకుల తయారీలో కోకో వినియోగిస్తారు.. క్రమంగా చాక్లెట్లు, కాఫీ, కేకుల కల్చర్ కూడా పెరిగిపోతుండడంతో.. ఆ పంట వేసిన రైతులకు సిరులు కురుస్తున్నాయి… కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటగా దీనిని సాగుచేస్తున్నారు రైతులు.. మరోవైపు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది… భారత్‌లో కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో రైతులు అధికంగా సాగు చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ కొన్ని ప్రాంతాల్లో ఈ పంట […]
కాంగ్రెస్‌తో దోస్తీ కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ దస్తీ వేసిండు అని.. పీసీసీ చీప్ రేవంత్‌రెడ్డి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్… నిన్న సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. ముందుగా కేసీఆర్ బూతులు లేకుండా మాట్లాడినందుకు సంతోషంగా ఉందన్నారు.. అరిగి పోయిన రికార్డు లాగా కొత్త విద్యుత్ బిల్లు గురించి మళ్లీ మళ్లీ అవే అబద్దాలు ఆడుతున్నారని విమర్శించిన ఆయన.. విద్యుత్ డ్రాఫ్ట్ బిల్లులో మూడవ పేజీ క్లాజ్ 4.7లో […]
తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు ఆర్మీకి, సైనికులకు సంబంధం ఏంటి? అని ప్రశ్నించారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్… తెలంగాణ భవన్లో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. నిన్నటి సీఎం కేసీఆర్ కామెంట్స్ పై కేంద్ర మంత్రులు బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. జీవిత కాలం హిందూస్థాన్, పాకిస్థాన్.. అంతేనా అంటూ నిలదీసిన ఆయన.. పుల్వామా సర్జికల్ స్ట్రెక్స్ ని రాజకీయంగా మీరు వాడుకుంటున్నారు అంటూ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. రాఫెల్లో అవినీతి […]
అజెండా నుంచి ప్రత్యేక హోదా అంశం తొలగింపు టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రేనని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర హోంశాఖ నేతృత్వంలో జరిగే సమావేశం అజెండా నుంచి ప్రత్యేక హోదా తొలగింపు చంద్రబాబు కుట్రే అన్నారు.. బీజేపీలోని టీడీపీ నేతల ద్వారా ఈ పని చేయించారని విమర్శించారు.. ఇక, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రత్యేక హోదాకు […]
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయం ఇప్పుడు మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.. విభజన సమస్యల పరిష్కారం కోసం జరిగే సమావేశం అజెండాలో మొదట స్పెషల్ స్టేటస్‌ను చేర్చిన కేంద్ర హోంశాఖ.. ఆ తర్వాత మళ్లీ తొలగించడంపై ఏపీ గుర్రుగా ఉంది.. ఈ వ్యవహారంలో బీజేపీతో పాటు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేస్తోంది తెలుగు దేశం పార్టీ.. ఈ వ్యవహారంపై శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ హామీతో వైసీపీ […]
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేయడం.. అస్సాం సీఎంను వెంటనే బర్తరఫ్ చేయాలంటూ ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను డిమాండ్ చేసిన విషయం తెలిసిందే కాగా.. ఇవాళ మీడియాతో మాట్లాడిన రేవంత్‌రెడ్డిని మళ్లీ కేసీఆర్.. కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారా? అనే ప్రశ్న ఎదురైంది.. దీనిపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు రేవంత్ […]
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది… ఇప్పటి వరకు పార్టీలో ఉన్న నియామక ప్రక్రియకు స్వస్తి చెప్పాలని నిర్ణయించింది… ఇవాళ హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వేదికగా పార్టీ రాష్ట్ర వ్యవహారల ఇంచార్జ్ ఠాగూర్ అధ్యక్షతన డీసీసీ అధ్యక్షుల సమావేశం జరిగింది… సభ్యత్వ నమోదుపై కీలకంగా చర్చించారు పార్టీ నేతలు.. మరోవైపు, పార్టీ ఎన్నికల నియమావళిని కూడా మార్చేందుకు నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ… గ్రామ శాఖ అధ్యక్షులకు కూడా ఎన్నికలే నిర్వహించాలని నిర్ణయించింది… ఇప్పటి వరకు […]
ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల కోసం ఏర్పాటు చేసిన సమావేశం అజెండాలో మొదట ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చి.. ఆ తర్వాత తొలగించింది కేంద్ర హోంశా శాఖ.. ఈ వ్యవహారంపై రచ్చ జరుగుతోంది.. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశంపై స్పందించారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్రం హోంశాఖ సమావేశం అజెండాలో ప్రత్యేకహోదా అంశం పొరపాటున చేర్చారని తెలిపారు.. ఈనెల 17న జరిగే సమావేశం.. […]