భారత్‌లో బంగారం ధర మళ్లీ పైపైకి ఎగబాకుతోంది.. రూ.51 వేల మార్క్‌ను మళ్లీ క్రాస్ చేసి దూసుకుపోతోంది 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. నవంబర్ 19 తర్వాత ఇదే గరిష్ఠస్థాయి కాగా.. భవిష్యత్‌లో పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మార్కెట్ విశ్లేషకులు.. ఇక, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా పెరుగుతోంది.. ఇవాళ రూ.100 పెరగడంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,050కి చేరింది.. 22 […]
హైదరాబాద్ శివారు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు వైభవంగా సాగుతున్నాయి.. ముచ్చింతల్‌కు వీఐపీల తాకిడి కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌షా, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలువురు కీలక నేతలు, సీఎంలు, కేంద్ర మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొన్న విషయం తెలిసిందే కాగా.. ఇవాళ సమతామూర్తి కేంద్రానికి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాబోతున్నారు.. మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు రాష్ట్రపతి.. బేగంపేట్‌లో రాష్ట్రపతికి గవర్నర్ […]
సీబీఐ చరిత్రలోనే అతిపెద్ద బ్యాంకు మోసాన్ని చూసింది నోరు వెల్లబెడతున్నారు అధికారులు.. ఇప్పటికే వందల, వేల కోట్లు బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టి.. విదేశాలకు చెక్కేసిన వ్యాపారవేత్తలు ఎందరో ఉండగా… దేశంలో మరో భారీ మోసం బయటపడిందది. నౌకల తయారీ రంగానికి చెందిన ఏబీజీ షిప్‌యార్డ్ దేశంలోని పలు బ్యాంకులను రూ.22,842 కోట్లకు మోసం చేసినట్టు బయటపడింది.. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. సంబంధిత కంపెనీ డైరెక్టర్లపై కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది.. ఏబీజీ షిప్‌యార్డ్.. మొత్తం […]
పీఎస్ఎల్వీ సీ- 52 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ మొదలైంది… కోవిడ్ మహమ్మారి పలు ప్రయోగాలపై ప్రభావం చూపగా.. నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి చాలా రోజుల తర్వాత రాకెట్ ప్రయోగానికి రెడీ అయ్యారు ఇస్రో శాస్త్రవేత్తలు.. ఇప్పటికే PSLV C-52 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది… 25 గంటల 30 నిముషాల కౌంట్ డౌన్ తర్వాత రాకెట్ ప్రయోగించనున్నారు.. ఇక, శ్రీహరికోటలో ప్రయోగ ప్రక్రియను ఇస్రో చైర్మన్ డా. ఎస్ […]
మేషం: ఈరోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు, వ్యాపారులకు విశ్రాంతి లభిస్తుంది. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. సోదరీ, సోదరుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటు చేసుకుంటాయి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. వృషభం : ఈ రోజు ఈ రాశివారు మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలియ జేయండి. టెక్నికల్, […]
దేశవ్యాప్తంగా మొత్తం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగుతుండగా.. తొలి విడతలో పోలింగ్ జరిగే గోవా, ఉత్తరాఖండ్‌లో ఎన్నికల ప్రచారానికి ఇవాళ తెరపడింది.. ఈ రెండు రాష్ట్రాల్లో ఒకే విడతలో ఈ నెల 14వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు.. అయితే, మిగతా మూడు రాష్ట్రాల్లోనూ పోలింగ్ ముగిసిన తర్వాత మార్చి 10వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తమ తమ పార్టీలకు అనుకూలంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో రెండు […]
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా టీకాల పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 15 ఏళ్లు పై బడిన వారందరికీ వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది.. ఇక, 15 ఏళ్లు లోపు పిల్లలకు కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది.. ఈ సారి 5 నుంచి 15 ఏళ్ల లోపు చిన్నారులకు కూడా టీకాలు వేయనున్నారు.. అయితే, దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ […]
రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు.. రాహుల్ గాంధీ తండ్రి ఎవరు అని మేం ఆడిగామా? అని అస్సాం సీఎం అంటే.. కాంగ్రెస్ పార్టీగా నేను అస్సాం సీఎంకి ఎంత మంది తండ్రులని అడగాలా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాహుల్ గాంధీ తండ్రి ఎవరని మూర్ఖత్వంగామాట్లాడడు.. అసలు రాహుల్ […]
ప్రపంచంలో ఇప్పటి వరకు ఏడు అద్భుతాలు ఉన్నాయి.. ఇప్పుడు రామానుజ సమతా మూర్తి విగ్రహం ఎనిమిదో అద్భుతం అని అభివర్ణించారు భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు.. ఇవాళ ముచ్చింతల్ ఆశ్రమానికి వచ్చిన ఆయన.. శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల వారి విగ్రహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, సమతామూర్తి సందర్శన తనకు లభించిన మహాభాగ్యం అని వెల్లడించారు. సమతామూర్తి కేంద్రం ప్రపంచంలో 8వ వింతగా పేర్కొన్నారు.. సమాత మూర్తి విగ్రహం ఏర్పాటు చేసినందుకు భారత […]