సినిమా టికెట్ల ధరలు, షోలు, ఇతర సినీ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ఇటీవలే తెలుగు సినీ ప్రముఖులు భేటీ అయిన విషయం తెలిసిందే.. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ, ఆర్. నారాయణమూర్తి, అలీ, పోసాని కృష్ణ మురళి సమావేశమై.. సీఎంతో చర్చించడం.. ఆ తర్వాత ప్రశంసలు కురిపించడం జరిగిపోయాయి.. అయితే, దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత […]
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లో 55 స్థానాలకు, ఉత్తరాఖండ్, గోవాలో అన్ని స్థానాలకు ఓటింగ్ జరిగింది. మూడు రాష్ట్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతం ప్రకారం గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ ఓటింగ్ నమోదైంది. ఇక్కడ సాయంత్రం 5 గంటల వరకు 75.29 శాతం ఓటింగ్ రికార్డైంది. సాయంత్రం 5 గంటల వరకు ఉత్తరప్రదేశ్‌లో 60.44 శాతం, ఉత్తరాఖండ్‌లో 59.37 శాతం ఓటింగ్ జరిగింది. Read […]
రహదారులు, భవనాల శాఖతో పాటు విశాఖ బీచ్ కారిడార్ పనుల పురోగతి పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష జరిపారు. రహదారుల భద్రత కోసం ఒక లీడ్ ఏజెన్సీను ఏర్పాటు చేయటానికి ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. దీనిలో పోలీసు, ట్రాన్స్పోర్ట్, హెల్త్, రోడ్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి నిపుణులు ఉంటారు. రోడ్ సేఫ్టీ ఫండ్ ఏర్పాటుకూ సీఎం జగన్ ఆమోద ముద్ర వేశారు. మరోవైపు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఆర్టీసీ, ప్రభుత్వం సంయుక్తంగా ఒక డ్రైవింగ్ స్కూలు […]
కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ మధ్య పూర్తి సామరస్యం, సరైన అవగాహన ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. క్రిప్టో కరెన్సీ సహా అన్ని అంశాలపై కేంద్రం, RBI ఒకే మాటపై ఉన్నాయని చెప్పారు. ఒక వ్యవస్థ పట్ల మరో వ్యవస్థకు పరస్పర నమ్మకముందన్నారు నిర్మల. జాతీయ ప్రయోజనాలు, ప్రాధాన్యాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నామన్నారు. రిజర్వ్ బ్యాంక్ బోర్డ్ మీటింగ్ తర్వాత గవర్నర్ శక్తికాంత దాస్ తో కలసి మీడియా ముందుకొచ్చిన నిర్మల… ప్రతీ విషయంలోనూ… […]
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్… ఆయనకు స్క్రిప్ట్ 10 జన్ పథ్ నుంచే వస్తుందని విమర్శించారు.. రాఫెల్ పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది… అవినీతి జరగలేదని చెప్పింది… కేసీఆర్ వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టే అన్నారు… కేసీఆర్ పీసీసీ చీఫ్ అవుతాడు… కాంగ్రెస్ నేతలరా మీ లీడర్ ఇక కేసీఆరే అంటూ సెటైర్లు వేశారు.. తాజాగా కేసీఆర్ సర్జికల్ స్ట్రైక్స్‌పై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు బండి సంజయ్.. […]
ప్రతీ ఏడాది హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నుమాయిష్ నిర్వహిస్తూ వస్తోంది ఎగ్జిబిషన్ సొసైటీ.. అయితే, కోవిడ్ మహమ్మారి ఎఫెక్ట్ నుమాయిష్‌పై కూడా పడింది… ఈ సారి ఎగ్జిబిషన్ ప్రారంభమైనా.. కరోనా థర్డ్ వేవ్ విజృంభించడం.. దీంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేయడంతో మళ్లీ నిలిపివేయాల్సి వచ్చింది.. కానీ, కరోనా కేసులు భారీగా తగ్గిపోవడం.. క్రమంగా ప్రభుత్వం కరోనా ఆంక్షలను సడలిస్తూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు పూర్తిగా ఎత్తివేయడంతో మళ్లీ ఎగ్జిబిషన్‌ను పునఃప్రారంభించేందుకు సిద్ధం అయ్యారు.. […]
మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆళ్లగడ్డలో జరుగుతోన్న అవినీతిని నిరూపించలేకపోతే రాజకీయాలకు గుడ్‌బై చెబుతానని ప్రకటించారు.. ఆళ్లగడ్డలో రోడ్ల విస్తరణ పేరుతో వైసీపీ నేతలు ప్రజలను లూటీ చేస్తున్నారు.. ప్రజలకు పరిహారం చెల్లించకుండా కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే రోడ్ల విస్తరణ పేరుతో వసూళ్లపై కలెక్టర్ దగ్గర విచారణకు రావాలని డిమాండ్ చేసిన ఆమె.. అవినీతిని నిరూపించలేకపోతే రాజకీయలకు గుడ్ బై చెప్పేస్తానని సవాల్ విసిరారు.. […]
రాహుల్ గాంధీపై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖండించడం.. ప్రధాని మోడీ, బీజేపీ అధిష్టానంపై ఓ రేంజ్లో ఫైర్ అవ్వడంతో… మళ్లీ కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూస్తున్నారంటూ రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. తెలంగాణ భవన్లో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఓవైపు బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే.. మరోవైపు కాంగ్రెస్‌కు చురకలు అంటించారు.. కాంగ్రెస్ […]
రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… రేపు రైతుల ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీ జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. 2021 నవంబర్‌లో భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్ట పోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది సర్కార్.. రేపు రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్… రేపు ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో నగదు జమ చేయబోతున్నారు.. రాష్ట్రంలోని […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతోన్న సమయంలో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం… కోవిడ్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూ నిబంధన తొలగిస్తున్నట్టు వెల్లడించారు.. కరోనా కేసులు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నామన్నారు.. అయితే, మాస్క్ ఆంక్షలు కొనసాగాలని నిర్ణయం తీసుకుంది సర్కార్.. ఇక, దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఇదే సమయంలో ఫీవర్ సర్వే […]