పులివెందుల, ఒంటిమిట్టలో పోలీసుల వైఖరిపై భగ్గుమంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ముందు ధర్నాకు దిగారు వైసీపీ నేతలు.. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల ఘటనలకు నిరసనగా ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ఎదుట బైఠాయించారు.. పోలీసులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని నినాదాలు.. ఎన్నికల కమిషన్ దగ్గర జరిగిన ఆందోళన కార్యక్రమంలో మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, హఫీజ్…
ఎంపీ అరెస్ట్ పై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. కడప జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని కూటమి నాయకులు అపహాస్యం చేశారు.. ప్రజాస్వామికంగా ఎన్నికలు జరగాలి.. కానీ, పోలీసులను అడ్డం పెట్టుకొని పోలింగ్ జరపడం దారుణం అన్నారు.. ప్రజలు పోలీసుల కాళ్లు పట్టుకుని మా ఓటు మేము వేసుకుంటాం అని ప్రాధేయపడుతున్నారు.. ఇలాంటి ఎన్నికలు దేశ చరిత్రలో ఎప్పుడు చూడలేదు.. చంద్రబాబుకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు అని వార్నింగ్ ఇచ్చారు
వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.. పులివెందుల, ఒంటిమిట్ట ఓటర్లు కూటమి అభ్యర్థిని గెలిపించేందుకు పూర్తిస్థాయి సన్నద్ధంగా ఉన్నారన్న ఆయన.. ఇందులో ఎటువంటి అనుమానము ఎవరికి అవసరం లేదు. వైసీపీ అరాచకాలకు తెరదించుతూ ఈ ఎన్నికల్లో ఓటర్లు తీర్పునివ్వనున్నారు. పూర్తి పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ జరుగుతుంటే తమ అరాచకాలు, ఎత్తులు సాగడం లేదని వైసీపీ తీవ్రంగా మదనపడిపోతుందని ఫైర్ అయ్యారు.
ఓవైపు వర్షాలు, మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో కృష్ణా నదిలో వదర ప్రభావం కొనసాగుతోంది.. దీంతో, ఈ ఏడాదిలోనే వరుసగా మూడోసారి శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు అధికారు.. శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుండగా.. ఈ ఏడాదిలో మూడోవ సారి రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తారు అధికారులు.. జలాశయం నాలుగు గేట్లను 10 అడుగులు మేర ఎత్తి దిగువన నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు..
దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకావాల్సి ఉంది.. అయితే, పోలీసుల విచారణకు ఆర్జీవీ వస్తాడా? రాడా? అనేది ఉత్కంఠగా మారింది.. కాగా, వ్యూహం సినిమా రిలీజ్ సమయంలో సోషల్ మీడియా వేదికగా ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గత ఏడాది నవంబర్ లో మద్దిపాడు పీఎస్ లో వర్మ పై కేసు నమోదు అయ్యింది.. ఇదే సమయంలో..…
ఉదయం 7 గంటలకే పులివెందులతో పాటు ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది.. అయితే, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.. పులివెందులలోని అవినాష్‌రెడ్డి ఇంటి వద్ద భారీగా మోహరించారు పోలీసులు.. దీంతో, ఆయన అరెస్ట్‌ను గ్రహించిన వైసీపీ శ్రేణులు అవినాష్ రెడ్డి ఇంటి వద్దే నిరసనకు దిగారు.
కడప జిల్లాలో రెండు జట్పీటీసీ ఉప ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.. ఇటు పులివెందులతో పాటు అటు ఒంటిమిట్ట జడ్పీటీసీ కోసం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయ్యింది.. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.. అయితే, తెల్లవారుజాము నుంచి టెన్షన్ వాతావరణం నెలకొంది.. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు..