Cyclone Montha: విజయవాడకు మొంథా తుఫాన్ ముప్పు.. రోడ్లపైకి రావద్దు..! నగరవాసులకు వీఎంసీ వార్నింగ్
- విజయవాడపై మొంథా తుఫాన్ ఎఫెక్ట్..
- రేపు 16.2 సెం.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం..
- వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమయ్యారు అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Montha: తీరం వైపు దూసుకొస్తున్న మొంథా తుఫాన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలను టెన్షన్ పెడుతోంది.. మొంథా తుఫాన్ ప్రభావంతో రేపు విజయవాడలో 162 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమయ్యారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) అధికారులు.. రేపు అత్యవసరమైతే తప్పా ప్రజలకు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్న అధికారులు.. తీవ్రత ఎక్కువ ఉంటే దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూసివేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు.. మెడికల్ షాపులు, కూరగాయలు, పాలు విక్రయ దుకాణాలు తెరుచుకోవచ్చని సూచిస్తున్నారు.. రోడ్లపై రాకపోకలు తగ్గించుకోవాలని వార్నింగ్ ఇచ్చారు వీఎంసీ అధికారులు.. చివరకు వాకింగ్ కి వెళ్లొద్దని సూచించారు.. మరోవైపు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్, వీఎంసీ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.. అత్యవసర పరిస్థితుల్లో ఎన్టీఆర్ జిల్లా కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్: 9154970454, వీఎంసీ కంట్రోల్ రూమ్: 0866 2424172, 0866 2422515, 0866 2427485 ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు..
Read Also: Flights Cancelled: మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. పలు విమానాలు రద్దు..
Also Read
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
మొత్తంగా మొంథా తుపాన్ నేపథ్యంలో అప్రమత్తమయ్యారు విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు.. నగరంలోని లోతట్టు ప్రాంతాలకు వరద, ముంపు సమస్య ఉంటుందని అధికారుల అంచనా వేస్తున్నారు.. కొండ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. రేపు భారీ వర్షం, ఈదురు గాలుల ప్రభావంతో కొండ చెరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.. ఇప్పటికే వీఎంసీ పరిధిలోని 64 డివిజన్లలో 40 వరకు పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్య లేకుండా నీటిని తోడేందుకు ట్యాంకర్లు, జేసీబీలను సిద్ధంగా ఉంచారు విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు.
తాజావార్తలు
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!