పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. జడ్పీటీసీ ఉప ఎన్నిక బ్యాలెట్ రూపంలో జరుగుతుండడంతో కూటమినేతలు భయపడుతున్నారని, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి కూటమి ప్రభుత్వం అక్రమ మార్గంలో గెలిచిందని విమర్శించారు.
మరోసారి చంద్రబాబుకు కరెంట్ షాక్ కొట్టడం ఖాయం అని వ్యాఖ్యానించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విద్యుత్ మీటర్ల పై ఫైర్ అయ్యారు.. డబుల్ ఇంజన్ గవర్నమెంట్ వచ్చినా పాత వైసీపీ ప్రభుత్వం విధానాలే అవలంభిస్తుందని విమర్శించారు.. స్మార్ట్ మీటర్లు బిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయడాన్ని సీపీఐ తీవ్రంగా ఖండిస్తోంది.. అదానీ కంపెనీతో పాటుగా మరో మూడు కంపెనీలకు దేశ వ్యాప్తంగా విద్యుత్ సంస్థను అప్పగించారు .. స్మార్ట్ మీటర్లు.. ప్రజల మెడకు ఉరితాడు అవుతోందని ఆవేదన…
స్త్రీ శక్తి స్కీమ్ ఆగస్టు 15 నుంచి ప్రారంభంపై ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఐదు రకాల బస్సుల్లో రాష్ట్రం అంతా మహిళలు ఉచితంగా ప్రయాణం చెయ్యచ్చు. పల్లె వెలుగు. అల్ట్రా పల్లె వెలుగు... సిటీ ఆర్డినరీ.. మెట్రో.. ఎక్స్ ప్రెస్‌లో ప్రయాణం చెయ్యచ్చు. ఆంధ్రప్రదేశ్ నివాసులైన మహిళలు, ట్రాన్స్జెండర్లు – ఐడీ ప్రూఫ్‌తో ఉచిత ప్రయాణానికి అర్హులు.. నాన్‌స్టాప్, ఇంటర్‌స్టేట్, చార్టర్డ్, ప్యాకేజ్ టూర్ బస్సులకు ఈ స్కీమ వర్తించదు.. సప్తగిరి ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్,…
పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా పోలింగ్ బూతుల వ్యవహారం తీవ్ర వివాదంగా మారింది.. రాష్ట్ర ఎన్నికల కమిషన్, కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అయితే, ఈ వ్యవహారం ఇప్పుడు హైకోర్టు వరకు వెళ్లింది.. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా పోలింగ్ బూతుల మార్పును సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది వైసీపీ.. ఈ రోజు వైసీపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరగనుంది.. ఎన్నికల సంఘానికి పోలింగ్ బూతుల…
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే నెలలో ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది ఇండియన్ ఆర్మీ.. ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేసింది.. భారత్ దెబ్బకు బెంబేలెత్తిన పాకిస్తాన్ కాళ్ల బేరానికి రాకతప్పలేదు. మరోవైపు, భారతే యుద్ధం వద్దని దిగువచ్చింది విజయం మనదే అంటూ.. ఆ దేశ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసింది.. అయితే, ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా జరిగిన దాడికి సంబంధించిన వీడియోను భారత వైమానిక దళం (ఐఏఎఫ్) విడుదల చేసింది..
గత ప్రభుత్వ హయాంలో 'ఆడుదాం ఆంధ్రా' పేరుతో ఆటలు నిర్వహించారు.. అయితే, దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి.. దీనిపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ పూర్తి అయ్యింది.. రేపో.. మాపో ఏపీ ప్రభుత్వానికి ఆడుదాం ఆంధ్రాకు సంబంధించిన నివేదిక అందనుంది.. దీంతో, వైఎస్ జగన్ కేబినెట్లో క్రీడా మంత్రిగా పనిచేసిన ఆర్కే రోజా అరెస్ట్ తప్పదా? అనే చర్చ సాగుతోంది..
వైఎస్ జగన్మోహన్రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పై కేసు నమోదు అయ్యింది.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. ఆ తర్వాత శ్రీవారి ఆలయం ముందు రాజకీయ వాఖ్యలు చేశారని రవీంద్రనాథ్ రెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు టీటీటీ విజిలెన్స్ అధికారులు. ఇక, విజిలెన్స్ ఫర్యాదుతో రవీంద్రనాథ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు తిరుమల పోలీసులు.
ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న సుచరిత అనే మహిళ.. బైక్‌పై బస్సు ను ఓవర్ టేక్ చేసింది.. బస్సు ను ఆపి డ్రైవర్ తో వాగ్వాదానికి దిగింది.. అనంతరం డ్రైవర్ పై చేయి చేసుకుంది.. తోటి ప్రయాణికులు ఎంత వారించినా వెనక్కి తగ్గకుండా దాడికి పాల్పడింది మహళ.. ఓ మహిళ తనపై దాడి చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఏపీఎస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ నటేష్ బాబు.. కాగా, డ్యూటీలో ఉన్న డ్రైవర్, కండక్టర్లపై దాడి చేస్తే.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంది ఏపీఎస్ఆర్టీసీ.