Kurnool Bus Accident: కర్నూలు బస్సు దర్ఘటనలో దగ్ధమైన బస్సు రిజిస్ట్రేషన్ పై అనుమానంతో అధికారులు పూర్తిస్ధాయి విచారణ చేపట్టారు.. బస్సును సీటర్‌గా రిజిష్టర్ చేసి స్లీపర్ గా మార్చడానికి డామన్ అండ్ డయ్యూ దాకా తీసుకెళ్ళినట్టు గుర్తించారు… పూర్తిస్థాయి విచారణ జరుగుతోందని, ఈ విధంగా ఆల్టరేషన్లు చేసిన బస్సులపై తనిఖీలు చేస్తున్నామని, కర్నూలు దుర్ఘటనపై కీలక విషయాలు వెల్లడించారు రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా..
Read Also: SIR Phase 2: ఈ డాక్యుమెంట్స్ లేకపోతే.. మీ పేరు SIR జాబితా నుంచి తొలగింపే!
విజయవాడలో NTVతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. కర్నూలు బస్సు ఘటనపై కీలక విషయాలు వెల్లడించారు ఏపీ రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా.. కర్నూలు జిల్లాలో దగ్ధమైన బస్సు మూడు సార్లు రిజిస్ట్రేషన్ అయ్యిందన్నారు.. మొదట తెలంగాణలోని మేడ్చల్ లో 53 సీటింగ్ వెహికల్‌గా రిజిష్టర్ చేసారు.. తరువాత వి. కావేరి యజమాని కొనుగోలు చేసి 2023లో 43 సీటింగ్ వాహనంగా డామన్ అండ్ డయ్యూలో రిజిష్టర్ చేసారు.. ఆ తరువాత డామన్ అండ్ డయ్యూ వాళ్లు 43 సీటింగ్ గానే NOC ఇచ్చారు.. అక్కడ నుంచి తీసుకొచ్చి ఒడిశాలో 43 స్లీపర్ గా రిజిష్టర్ చేశారు.. మొత్తం రిజిష్ట్రేషన్ విషయంలో అనుమానాలపై కర్నూలు ఎస్పీ విచారణ జరుపుతున్నారని తెలిపారు.. 600 బస్సులు ఆల్ ఇండియా పర్మిట్ తో మిగతా రాష్ట్రాలకు ఏపీ మీదుగా తిరుగుతున్నవి పరిశీలిస్తున్నాం.. 200 బస్సులు ఆల్ ఇండియా పర్మిట్ తో బయట రిజిష్టర్ అయ్యి ఏపీలో తిరుగుతున్నాయి.. 1600 బస్సులు ఆల్ ఇండియా పర్మిట్ తో ఏపీలో రిజిష్టర్ అయ్యి ఏపీలో తిరుగుతున్నాయి.. మొత్తం బస్సులు అన్ని మేం తనిఖీలు నిర్వహిస్తాం అని వెల్లడించారు ఏపీ రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా..