రెవెన్యూ, ఆదాయార్జన శాఖలపై సమీక్షించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు.. కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.. తిరుపతి ఎర్రచందనం డిపో సీసీటీవీలను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలన్నారు.. ఎర్రచందనం దుంగలను వ్యాల్యూ అడిషన్ చేసి ఉత్పత్తులు తయారు చేయాలి.. అలాగే ఎర్రచందనం ఉత్పత్తులు, ఇతర అంశాలు తెలియచేసేలా డిపో వద్ద ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను ఏర్పాటు చేయాలన్నారు..
విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో గొడుగుపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానికి సంబంధించిన దేవాదాయ భూముల్లో విజయవాడ ఉత్సవ్ నిర్వహించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. దేవాదాయ భూములను వాణిజ్య అవసరాలకు ఉపయోగించవద్దని ఆదేశాలు జారీ చేసింది.. వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించింది.. అందులో తోలిన గ్రావెల్, మట్టి, కంకరలను వెంటనే తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది.. అంతేకాదు, ఆ భూములను యథాస్థితికి తీసుకు రావాలని ఆదేశించింది..
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు.. ఈ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైఎస్ వివేకా కూతురు డాక్టర్ సునీతా రెడ్డి.. కేసులో మరింత విచారణ జరపాలి, కేసుతో సంబంధం ఉన్న కొందరి బెయిల్లను కూడా రద్దు చేయాలని వైఎస్ వివేకా కూతురు తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.. 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. 23వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుండగా.. ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని.. 24న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ర్ట ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు..
ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి సిట్ మరో ఛార్జ్ షీటును సోమవారం ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది ఇప్పటివరకు ప్రైమరీ, రెండో అదనపు ఛార్జిషీట్ దాఖలు చేసిన సీట్ తాజాగా మూడో అదనపు ఛార్జ్ షీట్ ను కోర్టులో దాఖలు చేసింది. కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవుల పాత్ర గురించి సీట్ ఈ తాజా ఛార్జ్ షీట్ లో పేర్కొంది.
విజయవాడ నగరంలో ట్రాఫిక్ పోలీసుల వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా వెళుతున్న వాహన చోదకులకు జరిమానాలు విధించడంతో సరిపెట్టకుండా సోషల్ మీడియాలో రీల్స్ చేయటం ఇప్పుడు వివాదానికి కారణమైంది సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ అవగాహన కల్పించడంలో తప్పేం లేనప్పటికీ అది హద్దులు దాటి అవతలి వాళ్ళని అవమానించే వరకు వెళ్లడంతో పోలీసులు అతి చేస్తున్నారని వరకు వ్యవహారం వెళ్లింది..
విజయవాడ రాజరాజేశ్వరి పేటలో డయేరియా వ్యాప్తి అరికట్టకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కలెక్టర్ల సదస్సులో అధికారుల తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య రంగంలో 15 సెప్టెంబర్, 2023 ఒక గొప్ప రోజు.. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలనా కాలంలో నాకు అత్యంత సంతృప్తిని మిగిల్చిన రోజు.. నేను ఒక మంచి పని చేయగలిగానన్న తృప్తి నాకు లభించింది.. 1923 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ రంగంలో కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉంటే, ఒక్క మా హయాంలోనే ఒకేసారి 17 మెడికల్ కాలేజీలను సంకల్పించాం అంటూ జగన్ ట్వీట్..