విజయవాడ నగరవాసులను మరోసారి బుడమేరు వరద టెన్షన్ పెడుతుంది.. గత ఏడాది ఇదే సమయంలో నగరాన్ని ముంచెత్తింది బుడమేరు వరద.. భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.. అదో పీడకలగా మారిపోయింది.. అయితే, రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలుచోట్ల పొంగి ప్రవహిస్తోంది బుడమేరు.. గుణదల ఒకటవ డివిజన్ లోని వంతెనపై నుంచి బుడమేరు ప్రవహిస్తోంది.. దీంతో, వంతెనపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది..
కడప జిల్లాలో ఆసక్తికరంగా మారిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో నేడు ఫలితాలు తెలిపోనున్నాయి.. కడప రిమ్స్ సమీపంలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు.. జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది..
ఈ రోజు విచారణకు వచ్చిన ఆర్జీవీ.. తన వెంట సెల్ ఫోన్ తీసుకురాగా.. వెంటనే ఆ ఫోన్ను సీజ్ చేశారు పోలీసులు.. రాంగోపాల్ వర్మ సెల్ ఫోన్ లో ఆధారాలు కోసం పరిశీలించనున్నారు.. ఇక, ఏపీ ఫైబర్ నెట్ నుంచి రాంగోపాల్ వర్మ కి రెండు కోట్లు చెల్లించిది గత వైసీపీ ప్రభుత్వం. రెండు కోట్ల వ్యవహారంలోనూ ఆర్జీవీని విచారించనున్నారు పోలీసులు. మరోవైపు చంద్రబాబు, పవన్ కల్యాణ్, , లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేయడం వెనుక ఉన్న వారిపై ఆరా తీస్తున్నారు పోలీసులు..
పులివెందులలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.. లా అండ్ ఆర్డర్ కాపాడుకుంటూ హక్కుల్ని కాపాడుకుంటూ ప్రజలకి భద్రత కల్పిస్తున్నారు.. వైసీపీ నేతలు ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతున్నారు.. ఈ రోజు దాదాపుగా 100 కోట్లకుపైగా ఖర్చు పెడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు..
చరిత్రలో ఇంత దారుణమైన ఎన్నికలు జరగలేదు అని ఆరోపించారు వైసీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబు.. ఓటర్లు ఓటు వేయటానికి ప్రయత్నించి పోలీసుల కాళ్లు పట్టుకుని నా ఓటు హక్కును వినియోగించుకునేలా అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడాల్సి వస్తుందన్నారు.. ఖాళీ మొత్తం స్థానాల్లో కాకుండా కేవలం పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు పెట్టారు.. ఇక్కడ గెలిచి వైఎస్ జగన్ పని అయిపోయింది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
పులివెందుల, ఒంటిమిట్టలో పోలీసుల వైఖరిపై భగ్గుమంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ముందు ధర్నాకు దిగారు వైసీపీ నేతలు.. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల ఘటనలకు నిరసనగా ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ఎదుట బైఠాయించారు.. పోలీసులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని నినాదాలు.. ఎన్నికల కమిషన్ దగ్గర జరిగిన ఆందోళన కార్యక్రమంలో మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, హఫీజ్…