Viral: నదిలో యువకుడి స్టంట్.. తిరిగిరాలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి.. వాగులు, వంకలు, చెరువులు, నదులు పోటెత్తుతున్నాయి.. చాలా మంది వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.. లక్షల ఎకరాల్లో పంట నష్టపోయారు రైతులు.. ఆయా రాష్ట్రాలు వరద నష్టాన్ని అంచనా వేసే పనిలో పడిపోయాయి.. తెలుగు రాష్ట్రాలను ఇంకా వరదలు వీడడం లేదు.. వర్షాలు తగ్గుముఖం పట్టినా.. గోదావరి ఉధృతి ఇంకా తగ్గలేదు.. అయితే, వరదల్లో ఎంతో మంది ఇబ్బంది పడుతుంటే.. మరికొందరు యువకులు, పిల్లలు వరదనీటిలోనూ ఈతలు కొడుతున్నారు. ఆటలు ఆడుతున్నారు. మరికొందరు వరదలో స్టంట్స్ చేస్తున్నారు.. అయితే, స్టంట్స్ పేరుతో బ్రిడ్జిపై నుంచి నదిలో దూకిన ఓ యువకుడు కనిపించకుండా పోయాడు…
Read Also: CM KCR: నేడు టీఆర్‌ఎస్ ఎంపీలకు సీఎం దిశా నిర్దేశం
Also Read
- Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
- Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
- Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
మహారాష్ట్ర జరిగిన యువకుడి స్టంట్ కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గిర్ణా నదిలో స్టంట్ చేయాలని అనుకున్నాడు నయీమ్ అమీన్ అనే యువకుడు.. దానిని ఫోన్‌లో చిత్రీకరించేందుకు తన స్నేహితుడిని కూడా వెంట తెచ్చుకున్నాడు.. ఇక, తన స్నేహితుడు ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో బందిస్తుండగా.. మాలేగావ్‌లో బ్రిడ్జిపైనుంచి గిర్ణా నదిలోకి దూకాడు నయీమ్ అమీన్.. కానీ.. అప్పటికే ఆ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. ఆ వరదలో కొట్టుకుపోయాడు.. ఇకనైనా పైకి తేలుతాడేమో.. అని చూసినా జాడ కనిపించలేదు.. ఎంతసేపు గాలించినా.. అతడి ఆచూకీ లభించలేదు. ఓవైపు వరదలతో జనం ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు ప్రాజెక్టులను, నది ప్రవాహాన్ని చూసేందుకు ప్రజలు భారీగానే వెళ్తున్నారు.. కానీ, ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ ఇలా ప్రాణాలు వదలడం మాత్రం విషాదాన్ని నింపుతోంది.
తాజావార్తలు
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
ట్రెండింగ్
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!