వరిసాగు కంటే ప్రత్యామ్నాయం చూపించే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం కలెక్టరేట్లో వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్బీకే వ్యవస్థ కొత్తగా రావడంతో ప్యాడీ ప్రొక్యుర్‌మెంట్‌లో గ్యాప్ వచ్చిందన్నారు.. రైతులకు ఈక్రాప్ విశయంలో అవగాహనా లోపం ఓ కారణమన్న ఆయన.. గత ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలు సమస్య రావడానికి కొత్త వ్యవస్థే కారణం అన్నారు.. అయితే, రాబోయే ఏడాది ఎలాంటి సమస్య ఉండదని భరోసా […]
పెట్రో ధరలు మంట మండుతున్నాయి.. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో పెట్రో ధరలకు బ్రేక్ పడినా.. ఆ తర్వాత 16 రోజుల పాటు పెట్రోల్, డీజిల్ ధరలను వడ్డిస్తూ వచ్చాయి చమురు సంస్థలు.. దీంతో.. పెట్రోల్ కొట్టించాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి.. డీజిల్ పోయించాలంటే.. లెక్కలు వేయించుకోవాల్సిన దుస్థితి వచ్చింది.. అయితే, ఓ పెట్రోల్ బంక్ యజమానికి నచ్చిన నేత పుట్టిన రోజు రావడంతో.. స్థానికులకు బంపరాఫర్ ఇచ్చాడు.. రూపాయికే లీటర్ పెట్రోల్ అందించాడు.. అయితే, దానికి వెనుక […]
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. 16 యూట్యూబ్ వార్తా ఛానెళ్లు బ్లాక్ చేస్తున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది.. వీటిలో 10 భారతీయ వార్తా ఛానెళ్లు ఉండగా.. 6 పాకిస్థాన్ ఆధారిత యూట్యూబ్ వార్తా ఛానెళ్లు ఉన్నట్టు ప్రకటించింది.. భారతదేశ జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్‌కు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు చర్యలు తీసుకున్నట్టు క్లారిటీ ఇచ్చింది కేంద్రం.. భారతదేశంలో భయాందోళనలు సృష్టించడానికి, మత సామరస్యాన్ని ప్రేరేపించడానికి పబ్లిక్ […]
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ.. రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది.. ఈ సమావేశంపై అనేక విధాలుగా ప్రచారం సాగుతోంది.. అయితే, పీకే-కేసీఆర్ భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. గత మూడు రోజులుగా ఓ అలజడి నడుస్తోంది.. పీకే.. కాంగ్రెస్, టీఆర్ఎస్ను కలపడానికి వచ్చిండు అంటున్నారు.. జాతీయ స్థాయిలో తీసుకునే నిర్ణయానికి మేం ఏమి చెప్పలేమన్నారు.. కానీ, రాహుల్ గాంధీ… టీఆర్ఎస్ గుంపుతో చేరినోడు వద్దు, కేసీఆర్‌తో […]
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా అంటూ వార్తలు వస్తున్నాయి.. వడ దెబ్బకు గురైన బండి సంజయ్.. తన పాదయాత్రకు రెండు రోజుల పాటు విరామం ఇవ్వనున్నారని వాటి సారాంశం.. అయితే, దీనిపై బీజేపీ క్లారిటీ ఇచ్చింది.. బండి సంజయ్ రెండో విడత ‘‘ప్రజా సంగ్రామ యాత్ర’’ రెండ్రోజుల పాటు వాయిదా పడుతుందనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది… ప్రజా సంగ్రామ యాత్ర యథావిథిగా కొనసాగుతుందని […]
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెబుతూ ఇక, వరుసగా నోటిఫికేషన్లు ఉంటాయంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు.. అయితే, కొంత గ్యాప్ వచ్చినా.. న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది సర్కార్.. ఇప్పటికే హోంశాఖ సహా.. ఇతర కొన్ని విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే కాగా.. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోన్న అభ్యర్థులకు తీపికబురు చెబుతూ.. పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది సర్కార్.. కానిస్టేబుళ్లు, […]
తెలంగాణలో మరోసారి పొత్తుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. దానికి ప్రధాన కారణం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అనే చెప్పాలి… ఓవైపు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి వ్యూహాలు రచిస్తున్న పీకే.. కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం గట్టిగానే సాగుతోంది.. కొందరు సీనియర్ నేతల మాటలు చూస్తుంటే.. పీకే కాంగ్రెస్ కండువా కప్పుకోవడం గ్యారెంటీ అనిపిస్తోంది. ఇదే సమయంలో.. తెలంగాణలో కూడా టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంటుందని..! ఏకంగా కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనం కాబోతోందంటూ […]
అక్రమ లేఅవుట్లు అతిపెద్ద సమస్యగా మారిందని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు… దేశవ్యాప్తంగా అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.. అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణను సవాల్ చేసిన జువ్వాడి సాగర్ రావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది సుప్రీం.. కేసులో అమికస్ క్యూరీగా సీనియర్ అడ్వకేట్ శంకర్ నారాయణను నియమించింది అత్యున్నత న్యాయస్థానం.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు జస్టిస్ నాగేశ్వరరావు.. అక్రమ లేఅవుట్లు అతిపెద్ద సమస్యగా మారాయన్న ఆయన.. అనియంత్రిత […]
దేశంలో కాంగ్రెస్ పని అయిపోయింది..! ఏ ఎన్నికలు జరిగినా ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోతున్నారు.. సీనియర్లు తిరుగుబాటు చేస్తున్నారు.. గట్టిగా ప్రభుత్వ వైఫల్యాలను కూడా నిలదీయలేని పరిస్థితి..! అంటే రకరకాల విమర్శలు ఎదుర్కొంటుంది ఆ పార్టీ.. అయితే, వరుస సమావేశాలు, సీనియర్లతో కూడా మంతనాలు జరిపి.. అందరినీ గాడీలోపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ఇదే సమయంలో, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో భేటీలు.. ఆయన ప్రతిపాదనలపై కీలక చర్చలు సాగుతున్నాయి.. అయితే, పీకే విషయంలో మాత్రం సమాధానం చెప్పడానికి […]
ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓ నాలుగైదు వారాల పాటు ఈ మూవీ గురించి పాజిటివ్ గానో, నెగెటివ్ గానూ మాట్లాడని సినిమా వ్యక్తులు లేరంటే అతిశయోక్తి కాదు. మూడు దశాబ్దాల క్రితం కశ్మీర్ లోని హిందూ పండిట్ల మీద జరిగిన దాడి, దాంతో వారు […]