నేషనల్ హెరాల్డ్ కేసులో ఇక విచారణ ముగిసినట్టే అని చెబుతున్నారు అధికారులు.. ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాహుల్, సోనియా గాంధీలను ప్రశ్నించింది ఈడీ.. మొదట్లో రాహుల్ గాంధీని సుదీర్ఘంగా విచారించి ప్రశ్నల వర్షం కురిపించింది.. ఆ తర్వాత సోనియా గాంధీని విచారణకు పిలిచింది.. అయితే, ఆ ఇద్దరి నుంచి ఒకే రకమైన సమాధాలు వచ్చినట్టుగా తెలుస్తోంది.. మనీ లాండరింగ్ కేసులో మూడో రౌండ్ విచారణ నిమిత్తం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు. మంగళవారం, ఈడీ అధికారులు ఆరు గంటల పాటు సోనియాను ప్రశ్నించగా, కేంద్ర సంస్థల దుర్వినియోగంపై కాంగ్రెస్ ఢిల్లీ మరియు ఇతర చోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టింది.. నిరసన తెలిపినందుకు రాహుల్ గాంధీ సహా వందలాది మంది పార్టీ కార్యకర్తలు మరియు అగ్రనేతలను అదుపులోకి అరెస్ట్ చేశారు పోలీసులు.. కానీ తర్వాత అందరినీ విడుదల చేశారు.
Read Also: Husband takes over as collector from wife: భార్య నుంచి కలెక్టర్ బాధ్యతలు స్వీకరించిన భర్త..
ఇక, 3వ రోజు సోనియా గాంధీని మూడు గంటల పాటు ప్రశ్నించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. అయితే, ఈ కేసులో తనయుడు రాహుల్ గాంధీ, తల్లి సోనియా నుంచి ఒకే రకమైన సమాధానాలు వచ్చినట్టుగా తెలుస్తోంది.. “అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్” ( ఏజేఎల్) “యంగ్ ఇండియన్ ప్రయువేట్ లిమిటెడ్” కు మధ్య జరిగిన లావాదేవీల వ్యవహారాలన్నీ కాంగ్రెస్ పార్టీ అప్పటి కోశాధికారి మోతీలాల్ ఓరా చూశారని సోనియా, రాహుల్ చెప్పినట్టుగా సమాచారం.. అయితే, 2020లో మోతీలాల్ ఓరా మృతిచెందిన విషయం తెలిసిందే..సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా పనిచేశారు మోతీలాల్ ఓరా… కాగా, ప్రస్తుతానికి నరేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ పూర్తి అయినట్టుగానే సమాచారం. సోనియా గాంధీని తదుపరి విచారణకు పిలవలేదు ఈడీ.. ఇప్పటి వరకు సోనియా గాంధీకి ఎలాంటి తాజా సమన్లు జారీ చేయలేదు.. మళ్లీ సమన్లు జారీ చేసేవరకు విచారణకు పిలవరు.. దీంతో.. ఈ కేసులో ప్రస్తుతానికి విచారణ ముగిసినట్టేనని సమాచారం.. ఇక, విచారణ ముగించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తదుపరి స్టెప్ ఎలా ఉంటుంది..? ఎలాంటి చర్లు తీసుకుంటుంది? అనేది ఆసక్తికరంగా మారింది..
ఉద్దేశ్యపూర్వకంగానే భారతీయ జనతా పార్టీ.. గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేసిందనే విమర్శలు ఉన్నాయి.. అందులో భాగంగానే ఈడీ విచారణ అని ఆరోపిస్తున్నారు.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కర్.. కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తూ.. ఇలా కక్ష్య సాధింపు చర్యలకు పూనుకుంటుందని మండిపడుతున్నారు.. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా.. ప్రధాని మోడీ విధానాలను తప్పుబట్టినా.. కేంద్రం వారిని టార్గెట్ చేస్తుందని విపక్షాలు దుయ్యబడుతున్నాయి.. ఈ తరుణంలో నేషనల్ హెరాల్డ్ కేసు ఎలాంటి మలుపు తీసుకుంటుంది? అనేది చర్ఛగా మారింది.