5G Auction: ‘5జీ’ వేలానికి సూపర్ రెస్పాన్స్.. తొలిరోజే ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
5జీ స్పెక్ట్రం కేటాయింపుల కోసం ఇవాళ వేలం ప్రారంభమైంది.. తొలిరోజు వేలానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.. ఈ ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియాతోపాటు ఈసారి అదానీ నెట్‌వర్క్ కూడా ఈ ఆక్షన్‌లో ప్రధాన పోటీదారుగా పాల్గొంది.. 5జీ స్పెక్ట్రం వేలం ద్వారా ప్రభుత్వానికి లక్ష కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుందని అంచనాలు ఉండగా.. ప్రస్తుతం మనం వాడుతున్న 4జీ నెట్‌వర్క్‌తో పోల్చితే 5జీ నెట్‌వర్క్‌లో పది రెట్లు వేగంగా ఆన్‌లైన్ సర్వీసులు అందనున్నాయి. ఇవాళ 72 గిగాహెర్జ్ 5జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కోసం వేలం ప్రారంభం అయ్యింది.. మొదటి రోజున బిడ్డింగ్ రూ.1.45 లక్షల కోట్లు దాటింది అంతే.. 5జీకి ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు..
Read Also: Gas Cylinder Blast: గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి.. తెరవెనుక కుట్ర?
Also Read
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్‌లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
- GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
- Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
భారత్ లో టెలికాం స్పెక్ట్రమ్ కోసం ఇంత భారీ వేలం నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.. వేలంలో.. జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, అదానీ గ్రూప్ కు చెందిన యాక్టివ్ లీ వంటి సంస్థలు పాల్గొనడంతో అనూహ్యంగా స్పందన వచ్చిందని అంచనా వేస్తున్నారు.. తొలిరోజు వేలంలో నాలుగు రౌండ్లు నిర్వహించామని, బిడ్డింగ్ మొత్తం రూ.1.45 లక్షల కోట్లు దాటిందని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇక, బుధవారం ఐదో రౌండ్ వేలం చేపట్టనున్నారు.. అయితే, ఇది అల్ట్రా-హై స్పీడ్‌లను (4G కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ) అందిస్తుంది. ఉచిత కనెక్టివిటీ, డేటాను పంచుకోవడానికి బిలియన్ల కొద్దీ కనెక్ట్ చేయబడిన పరికరాలను ప్రారంభించవచ్చు. ఐదో రౌండ్ వేలం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఆగస్ట్ 15 నాటికి స్పెక్ట్రమ్ కేటాయింపును పూర్తి చేయాలని భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.. 2022 చివరి నాటికి చాలా నగరాల్లో 5జీ సేవలు అందుతాయని వైష్ణవ్ చెప్పారు. 3300 MHz మరియు 26 GHz బ్యాండ్‌లు బలమైన బిడ్‌లను ఆకర్షించాయి – మిడ్ మరియు హై-ఎండ్ బ్యాండ్‌లు ఆసక్తిని కనబరిచాయి. 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌కు బిడ్లు కూడా వచ్చాయని మంత్రి విలేకరులకు తెలిపారు. నలుగురు బిడ్డర్లు పాల్గొనడం కలిసే వచ్చే అంశంగా అభివర్ణించారు.
తాజావార్తలు
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!