హిందూపురం నియోజకవర్గం అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. రెండో రోజు పర్యటనలో భాగంగా.. హిందూపురం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనం ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నామంటే ఎంతోమంది త్యాగమూర్తుల ఫలితమే మనకి స్వాతంత్ర్య దినోత్సవం అన్నారు.. ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం.. అందులో పూజారిని మాత్రమే నేను అన్నారు..
దేశమంతా కలిసి చేసుకునే ఒకే ఒక్క పండుగ జెండా పండుగ. జెండా పండుగ నాకు ఒక ఎమోషన్. ఇండిపెండెన్స్ డే అనగానే నాకు నా స్కూల్ రోజులు గుర్తొస్తాయి. ఇండిపెండెన్స్ డే వస్తుంది అంటే ఒక హడావిడి ఉండేది. ఫ్రెండ్స్ అంతా కలిసి స్కూల్ ను డెకరేట్ చేసే వాళ్ళం.
వందే భారత్ అంటూ ప్రసంగం ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. ఇవాళ 79వ స్వాతంత్య్ర వేడు జరుపుకుంటున్న శుభ సందర్భం.. భారతీయులకు, ప్రపంచంలోని తెలు వారికి, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. ఈ సమయంలో జాతిపిత మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, అల్లూరి సీతారామరాజు వంటి మహనీయులను స్మరించుకుందాం అన్నారు.
కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు పవన్ కల్యాణ్. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా కూడా పాల్గొన్నారు.. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. భారత్‌పై అంతర్జాతీయ కుట్ర చేయడానికి విదేశీ శక్తులు ప్రయత్నం చేస్తు్న్నాయ్నారు.. ఇక, విదేశీ శక్తుల కనుసన్నల్లో అంతర్గత శత్రువులు పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు.. జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఓడిపోయారు.. అందుకే ఎన్నికలపై ఆ విధంగా మాట్లాడుతున్నారు అంటూ కొన్ని పార్టీలపై…
ఇకపై విశాఖ నగరాన్ని బెగ్గర్ ఫ్రీ సిటీగా చూస్తామంటున్నారు విశాఖ పోలీస్ బాస్ శంఖ భ్రత బాగ్చి.. ఇందులో భాగంగా 243 మంది యాచకులను రెస్క్యూ చేసి వారికి ఆశ్రయం కల్పించారు.. జ్యోతిర్గమయ్య కార్యక్రమంలో అమలు చేస్తున్నామని తెలిపారు.. చీకటి నుంచి వెలుతురు వైపు ప్రయాణం చేసేందుకు బిక్షాటన చేసే వారికి, నిరాశ్రయులకు షెల్టర్ కల్పించి వారి జీవితాల్లో మరో కొత్త లైఫ్ జర్నీని ప్రారంభించనున్నారు.. రోజు ఎంతో మంది భిక్షాటన చేస్తూ, నిరాశ్రయులుగా రోడ్డు మీద పడుకోవడం తనకు ఎంతో బాధ అనిపించిందని…
సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటే నమ్మి చెన్నై వచ్చిన 14 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన కేసులో మలయాళ సినీనటి మిను మునీర్‌ను పోలీసులు అరెస్టుచే శారు. పోలీసుల కథనం.. పదేళ్ల క్రితం మిను మునీర్.. సినిమాల్లో నటించేలా చేస్తానని చెప్పి తన బంధువు కుమార్తె అయిన 14 ఏళ్ల బాలికను చెన్నై తీసుకొచ్చి ఓ ప్రైవేటు హోటల్లో ఉంచింది. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.
మంత్రి రాంప్రసాద్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్మోహన్రెడ్డికి మిగిలింది ఇక విలీనమే అన్నారు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు పోవడమే కాకుండా ఇప్పుడు సొంత మండలం కూడా పోయిందన్న ఆయన.. భారతీయ జనతా పార్టీ దగ్గరకు వెళ్ళలేడు కాబట్టి.. ఆయన మాతృ పార్టీ కాంగ్రెస్ పార్టీలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తాడేమో...? ఆయనకు మిగిలింది అదొక్కటే అని పేర్కొన్నారు