స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం.. ఈ సందర్భంగా బస్సులో సరదా సంభాషణ ఇప్పుడు వైరల్గా మారిపోయింది.. బస్సు ఎక్కగానే డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అయితే, డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోబోతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆపిన మంత్రి నారా లోకేష్ .. నా నియోజకవర్గానికి వచ్చారు.. నలుగురికి నేనే టికెట్ తీస్తాను అన్నా.. అంటూ పవన్ను ఆపారు లోకేష్.. తాను డబ్బులు ఇచ్చి సీఎం, డిప్యూటీ సీఎం ఇచ్చిన డబ్బులు…
కాకినాడ కేంద్రంగా సాగిన రేషన్ బియ్యం అక్రమ దందాపై ఏర్పాటు చేసిన సిట్ బృందం లో మరొకసారి మార్పులు చేర్పులు చేశారు... ఇప్పటివరకు ఐదు సార్లు సిట్ టీం ని మార్చింది ప్రభుత్వం.. అసలు రేషన్ మాఫియాపై విచారణ ఎప్పటికీ మొదలవుతుంది అనే దానిపై క్లారిటీ రావడం లేదు .. ఈసారి సిట్ బృందంలోకి సిఐడి ని కూడా ఇన్వాల్వ్ చేశారు
రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ్టి నుంచే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమల్లోకి రానుంది.. ఉండవల్లి నుంచి విజయవాడ బస్టాండ్కు బస్సులో రానున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు.. సాయంత్రం 4 గంటలకి విజయవాడ బస్టాండ్ లో ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు.. ఇక, ఆయా నియోజక వర్గాల్లో.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు..
పులివెందుల చరిత్రలో వైసీపీ ఓడిపోలేదు.. జడ్పీటీసీ ఉప ఎన్నికలపై న్యాయ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ..
బనకచర్లతో ఎవరికీ నష్టం జరగదు.. గోదావరి వృథా జలాలతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తాం.. బనకచర్ల ద్వారా గోదావరి వృథా జలాలు రాయలసీమకు మళ్లించాలని నిర్ణయించాం అన్నారు.. సముద్రంలోకి వృథాగా పోయే నీటినే వినియోగిస్తాం.. ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.. సముద్రంలోకి వృథా అవుతున్న నీటిని బనకచర్ల ప్రాజెక్ట్ ద్వారా వినియోగించుకుంటే తెలంగాణకి అభ్యంతరం ఏంటి..? అని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు నాయుడు..